పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ''రాధేశ్యామ్'' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఒకరోజు ముందుగా యుఎస్ఏలో అత్యధిక స్క్రీన్ లలో ప్రీమియర్స్ పడనున్నాయి.
రాధేశ్యామ్ టీమ్ మార్చి 10న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని అనుకున్నారు. అయితే కారణమేంటో తెలియదు కానీ.. ఇప్పుడు ఇండియాలో పెయిడ్ ప్రీమియర్ షోల ప్లాన్ ను మేకర్స్ విరమించుకున్నారని టాక్ నడుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఐదు షోలకు అనుమతి ఉండటంతో శుక్రవారం (మార్చి 11) తెల్లవారుజామున 4:00 గంటలకు షోలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రభుత్వం జారీ చేసే కొత్త జీవో పై ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే టికెట్ రేట్ల పెంపు సవరణ జీవోలో ఐదో షోకు అనుమతి ఇవ్వనున్నారు.
కాకపోతే ఇంతవరకు దీనిపై జగన్ సర్కారు నుంచి అధికారిక జీవో వెలువడలేదు. 'రాధేశ్యామ్' విడుదలకు ముందే వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఒకటీ రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ప్రభాస్ సినిమా ఏపీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.
కాగా, 1970స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ డ్రామాగా ''రాధేశ్యామ్'' చిత్రం తెరకెక్కింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై వంశీ - ప్రమోద్ - ప్రసీద నిర్మించారు. హిందీలో టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పకులుగా ఉన్నారు.
ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇందులో హస్త సాముద్రికా నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పూజా కనిపించనున్నారు. కృష్ణంరాజు - భాగ్యశ్రీ - మురళీ శర్మ - సచిన్ ఖేడ్‌కర్ - జయరామ్ - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ కపూర్ - ఎయిర్ టెల్ శాషా ఛత్రి - రిద్ది కుమార్ - సత్యన్ కీలక పాత్రలు పోషించారు.
జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనర్ గా వ్యవహరించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. ఆర్.రవీందర్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు.
రాధేశ్యామ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ శరవేగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విధికి ప్రేమకు మధ్య యుద్ధంగా అభివర్ణిస్తున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.