'ఒక ఊరిలో' సినిమాతో దర్శకుడుగా పరిచయమైన రమేష్ వర్మ.. పలు చిత్రాలకు రచయితగా నిర్మాతగా కూడా వ్యవహరించారు. 'రైడ్' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు.. 'వీర' 'అబ్బాయితో అమ్మాయి' వంటి చిత్రాలతో ప్లాప్స్ మూటగట్టుకున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత 'రాక్షసుడు' రీమేక్ తో మంచి విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో 'రాక్షసుడు' నిర్మాతలు ''ఖిలాడీ'' చిత్రాన్ని సెట్ చేసారు. రిలీజ్ కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.. ఆడియన్స్ నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. డైరెక్షన్ కు కూడా మంచి మార్కులు పడలేదు. దీంతో రమేష్ నెక్స్ట్ సినిమా పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది.
ప్రొడ్యూసర్ కోనేరు సత్యనారాయణ 'ఖిలాడీ' నిర్మాణ దశలో ఉన్నప్పుడే రమేష్ వర్మతో "రాక్షసుడు 2'' చిత్రాన్ని అనౌన్స్ చేసారు. ఎ స్టూడియోస్ సమర్పణలో హవిష్ ప్రొడక్షన్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తీయనున్నట్లు ప్రకటించారు. 100 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ మూవీ లెవల్ లో తెరకెక్కిస్తామని.. పూర్తిగా లండన్ లో చిత్రీకరించబడుతుందని తెలిపారు. అంతేకాదు ఇందులో ఓ స్టార్ హీరో నటిస్తారని మేకర్స్ వెల్లడించారు.
అయితే 'ఖిలాడి' రిజల్ట్ తో ఇప్పుడు ఈ 100 కోట్ల ప్రాజెక్ట్ ని రమేష్ వర్మ డీల్ చేయగలరా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా ఫలితం మీదనే ఎవరి కెరీర్ అయినా ఆధారపడి ఉంటుంది. ఎన్ని హిట్స్ ఇచ్చినా మధ్యలో ఒక ప్లాప్ పడితే.. అవకాశాల కోసం ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు టాక్ ని బట్టి చూస్తే.. 'ఖిలాడీ' సినిమా దర్శకుడికి ఆశించిన విజయాన్ని అందించలేదనే అనుకోవాలి.
ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడంతో రమేష్ వర్మకు నిర్మాత కోనేరు కోటి రూపాయలకు పైగా విలువ చేసే కారును బహుమతిగా ఇచ్చారు. మరి ఇప్పుడు సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తలపెట్టిన 'రాక్షసుడు 2' మూవీని ముందుకు తీసుకెళ్తారా లేదా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
'రాక్షసుడు 2' కథ మొదటి భాగం కంటే చాలా ఎగ్జైటింగ్ గా వచ్చిందని గతంలో మేకర్స్ తెలిపారు. ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ మరింత థ్రిల్లింగ్ గా ఉండబోతోందని అన్నారు. గిబ్రాన్ ను సంగీతం దర్శకుడిగా.. వెంకట్ సి దిలీప్ ను సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ మరియు శ్రీకాంత్ విస్సా కలిసి డైలాగ్స్ రాస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టత ఇస్తారేమో చూడాలి.