రకుల్ ప్రీత్ సింగ్ .. సౌందర్య తరువాత ఆ స్థాయి స్పీడ్ తో కెరియర్ గ్రాఫ్ ను పరుగులు తీయించిన కథానాయికగా కనిపిస్తుంది. చిన్న సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన రకుల్, చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ కేటగిరీలోకి చేరిపోయింది.
ఆమెతో పాటు వచ్చిన వాళ్లంతా అవకాశాల కోసం తడబడుతూ ఉండగానే ఆమె ఆమె భారీ విజయాలను తన బ్యాగులో వేసేసుకుంది. ఒక్కో స్టార్ హీరో జోడీగా మళ్లీ మళ్లీ అవకాశాలను అందుకుంటూ వెళ్లింది. ఇతర హీరోయిన్లు అసూయపడేంతగా రకుల్ బిజీ అయింది.
అలాంటి పరిస్థితుల్లో తన స్టార్ డమ్ తో బాలీవుడ్ లోను పాగా వేయాలని రకుల్ భావించింది. ఆ దిశగా గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించింది. బాలీవుడ్ వారికి జీరో సైజ్ అందాలంటే ఇష్టమని చెప్పేసి వాళ్ల కోసం మరింత బక్క పల్చగా మారిపోయింది.
తెలుగు ప్రేక్షకులు ఆమెను అలా చూడటానికి ఇష్టపడలేదు. తన అసలు టార్గెట్ బాలీవుడ్ అన్నట్టుగానే రకుల్ కూడా వ్యవహరించింది. ఏదో మొక్కుబడిగా తమిళ .. తెలుగు సినిమాలు చేస్తూ హిందీ పైనే దృష్టి పెట్టింది. ఫలితంగా తెలుగు తెరకి దాదాపు దూరమైపోయింది.
'చెక్' సినిమాలో లాయర్ గా .. జోడీ కుదరకపోయినా 'కొండపొలం' సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నాయికగా చేయడానికి రకుల్ అంగీకరించడం తన పరిస్థితి తానే చెప్పుకున్నట్టుగా అయింది. ఇక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి రకుల్ ధ్యాసే లేదు. ఏ ప్రాజెక్టులోను ఆమె పేరు వినిపించడం లేదు .. కనిపించడం లేదు. ఇంతవరకూ రకుల్ చేసిన హిందీ సినిమాలు ఆమెకి పెద్దగా పేరేమీ తెచ్చిపెట్టలేదు.
ప్రస్తుతం చేస్తున్న హిందీ సినిమాలు ఎంతవరకూ ఆమె కెరియర్ కి హెల్ప్ అవుతాయో తెలియదు. ఇంత స్పీడ్ గా జోరు చూపించి అంతే స్పీడ్ గా డ్రాప్ అయిన హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారంటే వెంటనే కనిపించేది ఇలియానానే.
'దేవదాస్' వంటి తొలి సినిమాతోనే హిట్ ఇచ్చేసి ఇలియానాకి తెలుగు ప్రేక్షకులు అభిమానులుగా మారిపోయారు. కథ లేకపోయినా .. దానిని నడిపించే నాయకుడు లేకపోయినా ఇలియానా ఒక్కతి ఉంటే చాలు అనుకున్నారు. దానికి తగినట్టుగానే పోకిరి .. జల్సా .. కిక్ .. జులాయి సినిమాలు ఇలియానాను ఎక్కడికో తీసుకుని వెళ్లాయి.
మన రేంజ్ టాలీవుడ్ కి చాలా ఎక్కువ అనే ఆలోచన ఆమెకి అప్పుడే వచ్చింది .. అంతే అటువైపు వెళ్లిపోయింది. అప్పుడు అవకాశాలైతే వచ్చాయిగానీ .. వాటి వెంట విజయాలు మాత్రం రాలేదు. దాంతో అమ్మడు ఖాళీ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రస్తుతం రకుల్ చేతిలో ఉన్న హిందీ సినిమాలు రిలీజ్ అయితేగానీ, ఆమె ఇలియానా వైపు వెళుతుందా? ఇటు వైపు తిరిగొస్తుందా? అనేది తెలియదు.