టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అంటే తెలియని వారుండరు. `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్న రామ్.. `ఇస్మార్ట్ శంకర్`తో మాస్ హీరోగా అందరి చేత మంచి మార్కలు వేయించుకున్నాడు.
దీని తరువాత వచ్చిన `రెడ్` కూడా హిట్ అవ్వడంతో రామ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం రామ్ కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లింగుసామీతో `ది వారియర్` అనే చిత్రం చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కుతున్న ఈ మూవీలో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించబోతుండగా..హీరో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు. ఇకపోతే ది వారియర్ అనంతరం రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ మూవీ చేయనున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో రామ్ తగ్గేదే లే అంటున్నాడట.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రామ్ తన రెమ్యునరేషన్‌ను బాగా పెంచేశాడట. ఇంతకు ముందు ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు ఛార్జ్ చేసిన రామ్.. బోయపాటి సినిమాకు మాత్రం ఏకంగా రూ. 18 కోట్లు ఇవ్వాల్సిందే అని నిర్మాతలను డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.