మాస్ దాస్ క్లాస్‌ మూవీ విడుదల తేదీ ఫిక్స్

Update: 2022-03-15 09:30 GMT
ఫలక్ నుమా దాస్‌ తో పాటు పలు సినిమాల్లో హీరోగా నటించి మాస్ ఆడియన్స్ ను మెప్పించిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌. యూత్‌ లో మరియు మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ను దక్కించుకున్న విశ్వక్‌ సేన్‌ హీరోగా అశోక వనంలో అర్జున కళ్యాణం అనే సినిమా తెరకెక్కింది. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యిందని ఇటీవలే ప్రకటించారు. సినిమా ప్రారంభం నుండి విభిన్నంగా ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.

సినిమా ప్రచారంను అమ్మాయి కావాలంటూ ప్రకటన ఇవ్వడంతో మొదలు పెట్టారు. అక్కడ నుండి విభిన్న తరహా లో హీరో పాత్రను మరియు ఇతర నటీ నటుల పాత్రలను పరిచయం చేస్తూ సినిమా పై జనాల్లో ఆసక్తిని మెల్ల మెల్ల గా పెంచడం లో సూపర్‌ సక్సెస్‌ అయ్యారు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క ప్రమోషనల్‌ పోస్టర్ మరియు వీడియోల్లో విశ్వక్‌ సేన్‌ చాలా క్లాస్ గా సైలెంట్‌ కుర్రాడిగా కనిపిస్తున్నాడు.

సినిమా లో ఆయన పాత్ర గతంలో ఎప్పుడు చూడని విధంగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మొదటి నుండి కూడా సినిమా పై కలిగిన ఆసక్తి మరియు పెరిగిన అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు కలిగిస్తూ వస్తున్నారు. వరుస సినిమా ల నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

ఎట్టకేలకు అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా విడుదల తేదీ వచ్చేసింది. వచ్చే నెలలో సినిమా ను 22వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఏప్రిల్‌ నెలలో పలు పెద్ద చిన్న సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అయినా కూడా విశ్వక్‌ సేన్‌ ఈ సినిమా తో ఏప్రిల్‌ 22న రాబోతున్నాడంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

బీవీఎస్ ఎన్ ప్రసాద్‌ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు విద్యా సాగర్ చంద్ర దర్శకత్వం వహించాడు. జయ్‌ క్రిష్‌ సంగీతం అందించిన ఈ సినిమాకు పవి కే పవవ్‌ సినిమాటోగ్రపీని అందించాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌ కు జోడీగా రుక్షాన్ దిల్హాన్ హీరోయిన్ గా నటించింది.

ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగుంటుందని ప్రోమోలు.. ఫోటోలు చూస్తుంటే అనిపిస్తుంది. తీవ్ర పోటీ నడుమ విడుదల కాబోతున్న అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి.
Tags:    

Similar News