`భీమ్లా నాయక్` చిత్రంతో మలయాళ నటి సంయుక్త మీనన్ టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. ఇందులో రానా కి జంటగా సంయుక్త నటించింది. సినిమా హిట్ అవ్వడంతో టీమ్ అందరికీ మంచి పేరు వచ్చింది. అయితే ఇందులో హీరోయిన్లుగా నటించిన ఇద్దరి పాత్రలు హైలైట్ అవ్వలేదు. పవన్ కి జోడీగా నటించిన నిత్యామీనన్ పాత్ర సహా సంయుక్త పాత్రకు అంతగా స్కోప్ లేదు. కేవలం పేరుకే హీరోయిన్లు అన్నట్లు స్క్రిప్ట్ లోనే త్రివిక్రమ్ ఆ రెండు పాత్రలకు పెద్ద పీట వేయలేదు.
ఆ కారణంగా నిత్యామీనన్ హర్ట్ అయిందని...గతంలోనూ త్రివిక్రమ్ ఇలాంటి తప్పిదం చేసారని అందుకే.. నిత్యామీనన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సైతం పాల్గొనలేదని మీడియా కథనాలు హీటెక్కించాయి. దీనికి నిత్యామీనన్ ఎలాంటి బదులివ్వ లేదు. అయితే సంయుక్త మీనన్ కూడా ఫీలైందన్న వార్త వెలుగులోకి వచ్చింది. తన పాత్ర విషయంలో సంతృప్తి చెందలేదని.. 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న అంత ప్రాముఖ్యత సినిమాలో ఎక్కడా కనిపించలేదని ఆ కారణంగా సంయుక్త సైతం హర్ట్ అయందనే ప్రచారం వెలుగులోకి వస్తోంది.
దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లు..డెబ్యూ మూవీ కావడంతో ఓపెన్ కాలేక తనలో తానే కుమిలిపోతోందని ప్రచారం సాగుతోంది. తాజాగా వీటిపై సంయుక్త మీనన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ``నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ `భీమ్లా నాయక్` లో నా పాత్ర విషయంలో కాదు. అభిమానులందరితో కలిసి రెండవ సారి సినిమా చూడాలనుకున్నా. కానీ టిక్కెట్లు దొరకలేదు. అందుకే మనస్తాపం చెందాను`` అని ట్వీట్ చేసింది.
అయితే టిక్కెట్ దొరకలేదని హీరోయిన్ ఇంతగా ఫీలవ్వాలా? అన్నదే ఇక్కడ సందేహం. సినిమాలో నటించిన హీరోయిన్ కే ఒక్క టిక్కెట్ దొరకలేదంటే..ఇది నమ్మే నిజమేనా? అన్న కొత్త సందేహాలు మొదలయ్యాయి.
చేతిలో సినిమా తీసిన నిర్మాతలు ఉన్నారు. ఒక్క టిక్కెట్ ఆమెకు ఇవ్వలేరా? అందుకు ఇంతగా ఫీలైపోవాలా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. సంయుక్త మీనన్ మనస్తాపానికి అసలు కారణం ఇది కాదని ఇంకేదో ఉందని..దాన్ని ఇలా టర్న్ చేసిందని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నిత్యా మీనన్ విషయంలోనూ ఇలాంటి ప్రచారం సాగింది కానీ ఆమె మౌనం వహించింది తప్ప సినిమా గురించి ఎక్కడా నోరు విప్పలేదు. కారణాలు ఏవైనా భీమ్లా నాయక్ విషయంలో హీరోయిన్ల ఇద్దరి పేర్లు ఇలా తెరపైఊకి రావడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే.
ఇప్పటివరకూ ఏ సినిమా విషయంలో హీరోయిన్లు ఫీలైనట్లు మీడియా కథనాలు రాలేదు. తొలిసారి ఇద్దరి హీరోయిన్లు అదీ ఒకే సినిమాలో నటంచిన వారిపై ఇలాంటి కథనాలు హైలైట్ అవుతున్నాయి. సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ చిత్రానికి ముందే కోలీవుడ్ లో ధనుష్ సరసన సర్ చిత్రానికి సంతకం చేసింది. ఇది ద్విభాషా చిత్రం. తెలుగు..తమిళ్ లో తెరకెక్కనుంది. భీమ్లానాయక్ సక్సెస్ నేపథ్యంలో ఆ ఇమేజ్ సర్ చిత్రానికి కలిసొచ్చే అంశం. భవిష్యత్ లో ఈ భామ మరింత బిజీ హీరోయిన్ అవుతుందని అంచనాలున్నాయి.