ఫోటోటాక్ : ఎద అందాలతో రెచ్చ గొడుతున్న క్యూట్‌ బ్యూటీ

Update: 2022-04-06 07:35 GMT
చిరంజీవి తనయుడు చరణ్‌ ఎంట్రీ ఇచ్చిన 'చిరుత సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ ను కూడా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా టాలీవుడ్‌ లో సక్సెస్ లను దక్కించుకోలేక పోయినా కూడా నేహా శర్మ కు ఎప్పటికి ఒక స్టార్‌ డమ్‌ అయితే ఇక్కడ అక్కడ ప్రతి చోట ఉంటుంది.

హీరోయిన్ నేహా శర్మ సోదరి ఐషా శర్మ ఇప్పుడు బాలీవుడ్‌ లో ఎంట్రీకి ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్ గా ఆమె చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా కూడా ఆమెకు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఓ రేంజ్ లో ఆమె స్టార్‌ డమ్‌ కొనసాగుతుంది. ఇన్ స్టా గ్రామ్‌ లో ఈ అమ్మడి అందాల ఆరబోత తో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.

ఈసారి ట్విట్టర్ లో ఈ ఫోటోను షేర్ చేసిన ఐషా శర్మ కుర్రకారును ఊపిరి కూడా తీసుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరీ దారుణంగా సోషల్‌ మీడియాలో ఈమె ఇంత అందాలు ఆరబోస్తే తాము ఏం కావాలంటూ కొందరు కొంటె కుర్రాళ్లు సోషల్‌ మీడియాలో సున్నితంగా ఐషా పై కామెంట్స్‌ చేస్తున్నారు.

నెట్టింట ఆమె చేస్తున్న హడావుడి చూస్తుంటే ఖచ్చితంగా త్వరలోనే స్టార్‌ హీరోయిన్ అవుతుందనిపిస్తుంది.

తాజాగా ఈ ఫోటో లో ఆమె షర్ట్‌ బటన్ విప్పి మరీ ఎద సౌందర్యంను చూపిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ అమ్మడి అందాల పై మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ దృష్టి పడటం లేదా.. ఈమెను ఎందుకు మన తెలుగు సినిమాల్లో నటింపజేయడం లేదు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు లో ఈమెను నటింపజేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అక్క సాధించలేని విజయాలను ఐషా సాధిస్తుందని ఆమె అభిమానులు నమ్ముతున్నారు.
Tags:    

Similar News