ఒకప్పుడు రజనీ .. కమల్ తమిళ బాక్సాఫీస్ ను శాసించారు. ఇప్పటికీ ప్రభ కొనసాగుతూనే ఉన్నప్పటికీ, ఆ తరువాత తరం వారిగా విజయ్ - అజిత్ తమ జోరును కొనసాగిస్తున్నారు. తమిళనాట విజయ్ కి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. అందువలన ఆయన తన సినిమాలో మాస్ కంటెంట్ పుష్కలంగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. కొంతకాలంగా విజయ్ మరింతగా విజృంభిస్తున్నాడు. బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిలించి వేస్తున్నాడు. తన సినిమాల రికార్డులను తానే అధిగమిస్తూ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నాడు. అలాంటి ఆయన తాజా చిత్రంగా 'బీస్ట్' నిర్మితమైంది.
సన్ పిక్చర్స్ ఎంత పెద్ద బ్యానర్ అనేది ఇప్పుడు చెప్పుకోవలసిన పనిలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఒకేసారి స్టార్ హీరోల సినిమాలను ఎక్కువ సంఖ్యలో పట్టాలెక్కించారు.
అలాంటి సినిమాల జాబితాలో ఒకటిగా 'బీస్ట్' కనిపిస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన నాయికగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. 'రాధే శ్యామ్' పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనా అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తరువాత సినిమాగా వస్తున్న 'బీస్ట్'పైనే ఈ నాజూకు భామ ఆశలు పెట్టుకుంది.
ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా ఒకే టైటిల్ తోనే జనంలోకి వెళుతున్నాయి. 'వలిమై' .. 'ఈటి' అలా వచ్చినవే. అలాగే తెలుగుతో పాటు ఇతర భాషల్లోను సేమ్ టైటిల్ తో 'బీస్ట్'ను వదులుతున్నారు. ఒక్క హిందీలో మాత్రం ఈ సినిమాకి 'రా' ( RAW) అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. విజయ్ నుంచి 'మాస్టర్' తరువాత వస్తున్న సినిమా కావడంతో, అందరిలోను ఆసక్తి ఉంది.
ఈ సినిమా తెలుగు అనువాద హక్కులు 11 కోట్లకు అమ్ముడైనట్టుగా చెప్పుకుంటున్నారు. విజయ్ సినిమాలకి ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఏర్పడటమే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ కంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఆయన స్టైల్ ను అక్కడి మాస్ ఆడియన్స్ బాగా లైక్ చేస్తారు. వాళ్లకి నచ్చే అన్ని అంశాలను పుష్కలంగా సర్దేసిన నెల్సన్ దిలీప్ కుమార్, ఈ సినిమాతో ఒక కొత్త విషయాన్ని ప్రేక్షకులకు చెప్పడానికి రెడీ అవుతున్నాడు. అనిరుధ్ సంగీతానికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. సెల్వ రాఘవన్ .. యోగిబాబు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాతో విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమనే నమ్మకంతో ఆయన అభిమానులు ఉన్నారు.