వేడి మీద ఉన్నపుడే సినిమాలు చేస్తూ వెళ్లాలి .. వేడి తగ్గకుండానే సినిమాలను బిజినెస్ చేయాలి. ఇక్కడ చాలామంది ఇదే సూత్రాన్ని ఆచరిస్తూ .. అనుసరిస్తూ వెళుతుంటారు. సాధ్యమైనంతవరకూ అభిమానులతో గ్యాప్ రాకుండా చూసుకుంటారు. ఫ్లాపే ఎదురుకానీ .. నష్టమే పలకరించని, తమ నుంచి ఒకదాని తరువాత ఒకటిగా సినిమాలు వస్తూనే ఉండాలని భావిస్తుంటారు. ఒక సినిమా పూర్తయ్యేలోగా రెండు సినిమాలను లైన్ మీదకి తీసుకుని వస్తుంటారు. తమ ప్రణాళిక దెబ్బతినకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
అలాంటి హీరోల జాబితాలో ఒకరిగా సూర్య కనిపిస్తాడు. తన తాజా చిత్రమైన 'ఈటి' ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆయన బాధపడుతూ కూర్చోలేదు. బాలతోను .. వెట్రి మారన్ తోను రెండు సినిమాలు లైన్లో పెట్టాడు.
ముందుగా బాల సినిమా సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. సొంత బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. ఇక ఆల్రెడీ రెండు హిట్లతో ఉన్న వరుణ్ తేజ్, రిలీజ్ కి మరో రెండు సినిమాలు రెడీ చేశాడు. ఆ సినిమాల్లో 'గని' ఏప్రిల్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా, మే 27న 'ఎఫ్ 3' పలకరించనుంది.
విజయ్ దేవరకొండ .. పూరి ఇద్దరూ కూడా చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లేవారే. కానీ కరోనా కారణంగా 'లైగర్' లేటు అవుతూ వచ్చింది. ఆగస్ట్ 25వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ లోగానే తమ కాంబినేషన్లో వెంటనే మరో సినిమాగా ' జన గణ మన' ప్రాజెక్టును పట్టాలెక్కించారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా కూడా చెప్పేశారు.
చైతూ కూడా ఈ మధ్య స్పీడ్ పెంచాడు. సమయాన్ని వృథా చేయకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు. విక్రమ్ కుమార్ తో 'థ్యాంక్యూ' చేసిన చైతూ, ఆయనతోనే ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. వెంకట్ ప్రభుతోను ఒక ప్రాజెక్టు సెట్ చేసుకున్నాడు.
అంతవరకూ సాయితేజ్ కూడా చాలా యాక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చినవాడే. అయితే ప్రమాదం కారణంగా పాపం కాస్త వెనకబడ్డాడు. పూర్తిగా కోలుకోగానే కెమెరా ముందుకు వెళ్లాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటి నుంచి దార్లో పడిపోవాలనే కసితోనే ఉన్నాడు. ఇలా హీరోలంతా రిలాక్స్ కాకుండా ఒకదాని తరువాత ఒకటిగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. కరోనా కారణంగా వచ్చిన గ్యాప్ ను కవర్ చేసేస్తున్నారు. సీనియర్ హీరోలైనా చిరంజీవి .. బాలకృష్ణ కూడా ఎక్కడ ఎంత మాత్రం తగ్గకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తుండటం విశేషం.