సౌత్ లేడీ సూపర్ స్టార్ హీరోయిన్స్ నయనతార మరియు సమంత. వీరిద్దరు కూడా ఒక్క భాషకు పరిమితం కాకుండా తమ ప్రతిభతో అందంతో భాషాబేధం లేకుండా అన్ని చోట్ల ఎంటర్ టైన్మెంట్ చేస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు.. కమర్షియల్ సినిమాలు.. హీరోలతో రొమాన్స్ చేసే సినిమాలు ఇలా ఏ సినిమా చేసినా కూడా వీరిద్దరి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అలాంటి ఇద్దరు ఇలా కలిశారు.
సమంత షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇద్దరు ముద్దుగుమ్మలు సాదారణంగా ఒక్క ఫ్రేమ్ లో కనిపించడం అనేది చాలా అరుదైన విషయం. ఏదైనా ఈవెంట్ లో కలిస్తే లేదంటే షూటింగ్ లో కలిస్తే కలుస్తారేమో అంతే కాని ఇలా స్పెషల్ గా కలవడం అనేది అరుదుగా జరుగుతుంది. తాజాగా స్పెషల్ డే 22.02.2022 సందర్బంగా వీరిద్దరు సందడి చేశారు. ఫోటో ఎప్పుడు తీసిందో క్లారిటీ లేదు కాని అభిమానులకు స్పెషల్ డే సందర్బంగా స్పెషల్ గా సమంత షేర్ చేసింది.
వీరిద్దరు కలిసి కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నటించారు. సమ్మర్ కానుకగా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో ఇద్దరిని కలిపి చూడటం తో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇలా ఫోటోను స్పెషల్ డే అంటూ షేర్ చేయడంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె లేదు కాని ఆమె మీ అందరికి ప్రేమను పంచుతుంది అంటూ సమంత కామెంట్ పెట్టింది.
కాతువాకుల రెండు కాదల్ సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్ తో పాటు ట్యాలెంటెడ్ యాక్టర్ అయిన విజయ్ సేతుపతి ఉన్నాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత ఏడాదిన్నర కాలంగా ప్రేక్షకులను ఊరిస్తుంది. కరోనా వల్ల ఆలస్యం అవుతుంది. ఈ సినిమా ను నయన్ మరియు విఘ్నేష్ లు కలిసి నిర్మించారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.
ఈ సినిమా కూడా తప్పకుండా తమిళ ప్రేక్షకులనే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో వీరి తెలుగు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో డబ్బింగ్ చేసే ఉద్దేశ్యం లేదా ఏంటీ అంటూ సోషల్ మీడియాలో విఘ్నేష్ శివన్ ను ప్రశ్నిస్తున్నారు.
సమంత.. నయనతార మరియు విజయ్ సేతుపతి ఇలా ముగ్గురికి కూడా తెలుగు లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కనుక కాతువాకుల రెండు కాదల్ సినిమా ను డబ్బింగ్ చేస్తే మంచి స్పందన ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళంకు ఏమాత్రం తగ్గకుండా తెలుగు లో కూడా వసూళ్లు దక్కించుకునే అవకాశం ఉంది. కనుక ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ను ప్రకటించాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.