విజయ్ దేవరకొండ అంటే దూకుడుకు మారిపోరు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఇప్పటిదాకా ఏ హీరోలో చూడని యాటిట్యూడ్‌తో అతను ఈ తరం యువతకు ఫేవరెట్ అయిపోయాడు. సినిమాలో అతడి నటనకు మించి.. బయట అతడి యాక్ట్స్ ఎక్కువగా యూత్ దృష్టిని ఆకర్షించాయి. తన మీద జరిగిన ట్రోల్స్‌ను ‘గీత గోవిందం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్లే చేసి తన మీద తనే సెటైర్లు వేసుకున్నా.. ‘ట్యాక్సీవాలా’ సినిమా షో నడుస్తున్న థియేటరుకెళ్లి ప్రేక్షకులందరి క్యాంటీన్ బిల్ పే చేసినా అతడికే చెల్లింది.
ఇలా అతను తెచ్చుకున్న పాపులారిటీ, సినిమాలకు ఇచ్చిన ప్రమోషన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు హీరోలు అతణ్ని అనుకరించే ప్రయత్నం చేస్తే బెడిసికొట్టింది. విజయ్ యునీక్, ట్రెండ్ సెట్టర్ అన్న విషయాన్ని యూత్ గుర్తించారు. ఐతే సక్సెస్‌లు వచ్చినపుడు ఏం చేసినా చెల్లుతుంది కానీ.. వరుసగా ఫెయిల్యూర్లు ఎదురైతే మాత్రం ఎలాంటి వాళ్లయినా మారాల్సిందే. విజయ్ కూడా అందుకు మినహాయింపు కాదనే అనిపిస్తోంది.
‘లైగర్’ సినిమా ఫెయిల్యూర్ విజయ్‌ని చాలా మార్చేసిందన్నది అతడిని దగ్గరగా గమనిస్తున్న వారు చెబుతున్న మాట. ఈ సినిమాకు ముందు కూడా ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లాంటి ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు విజయ్. అవేమీ విజయ్ మీద ప్రభావం చూపలేదు. ‘లైగర్’ టైంలో చాలా కాన్ఫిడెంట్‌గా, ఎప్పట్లా యాటిట్యూడ్, అగ్రెషన్ చూపిస్తూ ఎప్పుడైనా తాను ఇలాగే ఉంటా అనిపించాడు.
కానీ ఈ సినిమా గురించి ఒక రేంజిలో చెప్పి, విపరీతమైన బిల్డప్ ఇచ్చి.. చివరికి సినిమాలో దమ్ము లేక చతికిలపడడంతో విజయ్ డంగైపోయాడు. విజయ్ మాటలకు, సినిమాకు అసలు పొంతన లేకపోవడంతో విపరీతమైన ట్రోలింగ్ తప్పలేదు. విజయ్ అంత అతి చేయకపోతే సినిమా ఒక మోస్తరుగా అయినా ఆడేదేమో. కానీ అతడి అతి వల్ల విపరీతమైన ట్రోలింగ్ జరిగి, నెగెటివిటీ స్ప్రెడ్ అయి తొలి రోజు సాయంత్రం నుంచి థియేటర్లు వెలవెలబోయాయి.
ఈ నెగెటివిటీ, సినిమా పెర్ఫామెన్స్ చూసి షాకైన విజయ్.. ఆ తర్వాతి నుంచి భిన్నంగా కనిపిస్తున్నాడు. సైమా వేడుకలో అతను మాట్లాడుతున్నపుడు ఏడుపు ఆపుకుంటున్నట్లు కనిపించింది. అప్పట్నుంచి సోషల్ మీడియాలో విజయ్ పెద్దగా కనిపించడం లేదు. సన్నిహితుల వద్ద కూడా డల్లయిపోయాడని, ఇంతకుముందున్న ఉత్సాహం లేదని, మళ్లీ హిట్టు కొట్టినా ఇంత అతి చేయడం, యాటిట్యూడ్ చూపించడం విజయ్ చేయకపోవచ్చని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.