ప్రియుడికి అధికారికంగా బ్రేకప్ చెప్పేసిన బిగ్ బాస్ విన్నర్

Update: 2022-03-07 05:33 GMT
కాలం మారింది. ఎంతలా అంటే.. తాజా ఉదంతమంత. ఈ మధ్య వరకు కూడా పెళ్లి చేసుకొని.. భార్యభర్తల బంధం బద్ధలైపోయిన వేళ.. మేం విడిపోతున్నామంటూ ప్రకటనలు ఇచ్చే సెలబ్రిటీలు.. నటీనటులు.. క్రీడాకారుల్ని చూసి ఉంటాం. ఇప్పుడు చెప్పేది ఇంకో లెవల్.

తన ప్రియుడితో బ్రేకప్ చెప్పేసిన నటి కమ్ బిగ్ బాస్ విన్నర్.. ఆ విషయాన్ని అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ప్రియుడు వరుణ్ సూద్ తో నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉండి.. ఈ మధ్యనే ఇల్లు కొనుగోలు చేసిన వీరు.. తాజాగా విడిపోతున్నట్లుగా పేర్కొంది నటి దివ్య అగర్వాల్.
తన ఫోటోను షేర్ చేసి మరీ.. తాను చెప్పాల్సిన విషయాన్ని వివరంగా వెల్లడించింది.

సదరు పోస్టులో ఎమోషనల్ అయ్యింది. లైఫ్ సర్కస్ లాంటిదని.. అందరినీ సంతోషంగా ఉంచటానికి ప్రయత్నించాలన్న ఆమె ఎవరి నుంచి ఏదీ ఆశించొద్దని.. అదే నిజమని పేర్కొంది. సెల్ప్ లవ్ తగ్గిపోవటం మొదలైనప్పుడు ఏం జరుగుతుంది? తన జీవితంలో జరుగుతున్న దానికి తాను ఎవరినీ నిందించనని.. అదే మంచిదని చెప్పింది.

'నా కోసం నేను బతకాలనుకుంటున్నా. నేను కోరుకున్న విధంగా సొంతంగా జీవించటానికి సమయం వెచ్చించాలనుకుంటున్నా' అని అధికారికంగా ప్రకటించింది. టీవీ సిరీస్ ఎస్ ఆఫ్ స్పేస్ కు ముందు నుంచే వరుణ్.. దివ్యలు స్నేహితులు. ఇక్కడి పరిచయం వీరి మధ్య ప్రేమగా మారింది. ఆపై దివ్యకు వరుణ్ ప్రపోజ్ చేయటం.. అందుకు ఆమె ఓకే చెప్పటంతో వారి లవ్ జర్నీ షురూ అయ్యింది. నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరి మధ్య ఏమైందోకానీ.. తాజాగా ఆమె బ్రేకప్ పోస్టు పెట్టి అందరిని షాక్ కు గురయ్యేలా చేసింది.

చూడచక్కని జంటగా ఉంటూ.. హ్యాపీగా ఉన్నట్లుగా కనిపించే ఈ జంట మధ్య ఏం జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తన పోస్టులో తన ప్రియుడు వరుణ్ ను ఒక్క మాట అనకపోగా.. అతను ఎప్పుడూ తనకు మంచి స్నేహితుడేనని.. అతడితో గడిపిన క్షణాలన్నీ సంతోషకరమైనవేనని పేర్కొంది. ‘ఒక నిర్ణయాన్ని తీసుకోవటానికి పెద్ద పెద్ద కారణాలు.. సాకులు అవసరం లేదు. ఈ బంధం నుంచి బయటపడటానికి నేను తీసుకున్న నిర్ణయమే ఇది’ అని ఆమె వెల్లడించింది.

ఇప్పటివరకు పెళ్లి తర్వాత విడిపోయినట్లు ప్రకటించటం చూశాం. ఇప్పుడు.. ప్రేమలో ఉండి విడిపోయిన వైనాన్ని ఓపెన్ గా చెప్పేసే కొత్త కల్చర్ రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందన్న విషయం దివ్య అగర్వాల్ పోస్టును చూస్తే.. అర్థం కాక మానదు.
Tags:    

Similar News