యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ''థ్యాంక్యూ''. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశీఖన్నా - మాళవికా నాయర్ - అవికా గోర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. జులై 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చైతూ - రాశీ కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏవైనా మూడు డబుల్ మీనింగ్ పదాలు చెప్పాలని నాగచైతన్య ని కోరాడు యాంకర్. దీనికి చై స్పందిస్తూ.. తనకు డబుల్ మీనింగ్ పదాలు తెలియవని చెప్పారు. ఏదైనా ఉంటే స్ట్రెయిట్ గా చెప్తానని.. అందులో డబుల్ మీనింగ్ ఉండదని తెలిపారు. అంతేకాదు డబుల్ మీనింగ్ పదాలు ఏంటో తననే చెప్పమని తిరిగి యాంకర్ ని ప్రశ్నించారు అక్కినేని హీరో.
స్ట్రెయిట్ గా ఉండేవారి దగ్గర డబుల్ మీనింగ్స్ ఉండవని.. ఏదైనా నేరుగా పాయింట్ గురించి మాట్లాడతారని చైతన్య చెప్పారు. 'హాట్' అనే పదం వినగానే గుర్తొచ్చే ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పమని అడగ్గా.. ఏంజిలీనా జూలీ - డానియేల్ క్రెయిగ్ - జెస్సికా అని చెప్పారు చై.
బ్యాడ్ డేట్ నుంచి తప్పించుకోడానికి మార్గాలు చెప్పమంటే.. అది ఎలాంటిదైనా తాను ఎస్కేప్ చేయనని.. ఆ డేట్ ని ఫినిష్ చేస్తానని చైతూ తెలిపారు. అవతలి వ్యక్తిని బాధ పెట్టకూడదనే ఉద్దేశ్యంతో చై బ్యాడ్ డేట్ అయినప్పటికీ.. ఫినిష్ చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చైతన్య నిజంగా హానెస్ట్ పర్సన్ అని.. స్వీట్ హార్టెడ్ పర్సన్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, 'మనం' వంటి క్లాసిక్ తర్వాత నాగచైతన్య మరియు విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో రూపొందిన ''థాంక్యూ'' సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇందులో మూడు వైవిధ్యమైన లుక్స్ లో చైతు కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ 'థాంక్యూ' సినిమాని నిర్మించారు. బీవీఎస్ రవి కథ అందించిన ఈ సినిమాకు హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.
Full View

సమంత తో విడాకుల ప్రకటన తర్వాత నాగచైతన్య నుంచి రాబోతున్న మూడో సినిమా ఇది. 'మజిలీ' 'వెంకీమామ' 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు' వంటి వరుస విజయాలతో జోష్ మీదున్న నవ యువసామ్రాట్.. 'థాంక్యూ' చిత్రంతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.