రెండు భారీ చిత్రాలు ఒకే సీజన్ లో విడుదలైతే బాక్సాఫీస్ క్లాష్ తప్పదు. కానీ భారీ సినిమాల్ని రిలీజ్ చేసిన సమయంలో కూడా భయపడకుండా శర్వానంద్ తన సినిమాల్ని విడుదల చేసి హిట్లు కొట్టాడు. ఇంతకుముందు సంక్రాంతి బరిలో `శతమానం భవతి` ఈ కేటగిరీనే. ఖైదీనంబర్ 150- గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాలు విడుదలైన సమయంలోనే శతమానం భవతి లాంటి చిన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని విడుదల చేసి చక్కని వసూళ్లను సాధించారు.
అయితే ఇప్పుడు `ఆడవాళ్లు మీకు జోహార్లు` పరిస్థితి అందుకు భిన్నమైనదేమీ కాదని విశ్లేషిస్తున్నారు. శర్వా నటించిన AMJ సినిమా చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాల్లో పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అలరించనుందని టాక్ ఉంది. ట్రైలర్ ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే దురదృష్టవశాత్తు రాంగ్ టైమ్ లో రిలీజ్ అవుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు.
ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గొప్ప క్రేజ్ ఉన్న ప్రభాస్ `రాధేశ్యామ్` ని అత్యంత భారీగా విడుదల చేస్తుంటే శర్వా అనవసరంగా సాహసం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. AMJ స్క్రీన్ లను రాధేశ్యామ్ ఆక్రమిస్తే సన్నివేశమేంటి? అన్నదే హాట్ టాపిక్ గా మారింది. మార్చి 11 నుంచి రాధేశ్యామ్ థియేటర్లలోకి వస్తోంది. అంటే మార్చి 4న విడుదలవుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు కి వారంలోనే గట్టి ఇబ్బంది ఎదురు కానుందని భావిస్తున్నారు. అయితే సినిమా బావుంది అంటే వారం సరిగ్గా ఆడితే చాలు.. రికవరీ సాధ్యమని శర్వా టీమ్ భావించి ఉండొచ్చంటూ విశ్లేషణ సాగుతోంది. ఇవి రెండూ ఒకేరోజు విడుదల కావడం లేదు కాబట్టి అది కలిసొచ్చే అంశం కానుంది. కానీ AMJ బావుండీ బాగానే ఆడుతున్నా థియేటర్ల నుంచి రాధేశ్యామ్ వల్ల తొలగిస్తే అది ఇబ్బందికరంగా మారుతుంది. ఇలా ఇంతకుముందు చాలా సినిమాలకు జరిగింది. కానీ ఫ్రెండు శర్వానంద్ కోసం ప్రభాస్ పర్ఫెక్ట్ గా సహాయపడతారనే భావిస్తున్నారు.
ట్రైలర్ మెప్పించడం పెద్ద ప్లస్
ఏఎంజే ట్రైలర్ ఇంతకుముందు విడుదలై ఆకట్టుకుంది. ఇందులో శర్వా బ్యాచిలర్ గా కనిపించాడు. మంచి క్వాలిటీస్ ఉన్న వరుడిగా ఈ మూవీలో కనిపిస్తున్నాడు శర్వానంద్. అతడు తన బ్యాచిలర్ షిప్ ని ప్రెజెంట్ చేస్తూ `ఆడవాళ్లు మీకు జోహార్లు` అంటూ ఎమోషన్ రగిలించనున్నాడు. ఆడవాళ్ల సామ్రాజ్యంలో అతడి పాట్లు ఏమిటన్నది ఈ సినిమాలో చూడగలం. ఇంతకుముందు విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఫన్ తో నిండి ఉంది. ఇక ప్రతి ఫ్రేమ్ లోనూ డజను మంది ఆడవాళ్లు కనిపించడం విశేషం.
ఏ బ్యాచిలర్ అయినా ఆడవాళ్లను మెప్పించడం అంత వీజీ కాదు. పడి పడి కాళ్ల మీద పడి దండాలు పెట్టినా .. అణకువగా పద్ధతిగా కనిపించాలని ప్రయత్నించినా లేదా వీకెండ్ లో అన్నవరం అంతర్వేది వెళ్లొస్తాననేంత బుద్ధిగా ఉన్నా ఆడవాళ్లను నమ్మించేయడం అంత ఈజీ కానే కాదని తెలుసుకున్నాడు శర్వా. ట్రైలర్ లో ఆడావాళ్ల కాళ్ల మీద పడి పడి మరీ ఏంటిదీ? అనే రేంజులో మంచితనం కురిపించాడు. ఇంతమంది ఆడాళ్ల మధ్య ఎలా వేగావయ్యా? అంటూ జాలి కురిపించేంత మంచి బాలుడిలా కనిపిస్తున్నాడు. ఆడవాళ్ల సామ్రాజ్యంలో బ్యాచిలర్ పెళ్లి పాట్లు..! ఎలా సాగాయి? అన్నది కూడా మరో కొసమెరుపు. ఇక ఇందులో గీత గోవిందంలో గీత రేంజులో రష్మిక కటింగులు తక్కువేమీ కాదు. పాపం పసోడు అలా వెంటపడుతుంటే కనికరించని అమ్మాయిగా కరుకుగా కనిపిస్తోంది. మనసన్నదే లేని మగువతో అతడి పాట్లేమిటో కూడా సినిమాలో చూడగలమని భరోసా కనిపించింది. ఇకపోతే అమాయకుడిలా పద్ధతైన వాడిగా.. తాగుడు అయినా అలవాటు లేనివాడిగా.. పడి పడి దండాలు పెట్టేవాడిగా శర్వాలోని విలక్షణత మరోసారి బయటపడుతోంది.
ఇక ట్రైలర్ లోనే ఇన్ని కోణాలు ఆవిష్కరిస్తే సినిమా ఆద్యంతం ఇంకెంతగా పడి పడి దండాలు పెడతాడో ఏమిటో అనిపించేలా ఉంది. ఇక ప్రతి ఫ్రేమ్ లో సీనియర్ నటీమణులు రాధిక- ఊర్వశి-ఖుష్బూ తదితరులు పదిమంది కనిపిస్తున్నారు. దీనివల్ల కూడా ఆడవాళ్ల సామ్రాజ్యం తెరపై నిండుగా ఆవిష్కృతమైంది. ఒక రకంగా శర్వానంద్ శతమానం భవతి- గీత గోవిందం కలిపి కొట్టారా? అన్నట్టుగా ఉంది. నేరేషన్ మాత్రం కాస్త స్లోగా కనిపిస్తోంది.
ఈ చిత్రానికి నేను శైలజ .. చిత్రలహరి.. రెడ్ వంటి చిత్రాల్ని తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ప్రేమకథల్ని స్పెషల్ టోన్ తో తెరకెక్కించే కిషోర్ తిరుమల ఆడవాళ్లు అంటున్నారు కాబట్టి అందుకు తగ్గట్టే మంచి ఫ్యామిలీ లేడీ సెంటిమెంట్ సినిమా చేసారని అర్థమవుతోంది. ఈ సినిమా కథా కంటెంట్ పై శర్వా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీతో శర్వా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.