షికారు : దేవిక బాత్రూమ్‌లో బాబీ గోల‌

Update: 2022-02-24 09:30 GMT
అరవ‌న్ - ప‌ర‌దేశి - క‌బాలి వంటి చిత్రాల్లో న‌టించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుక‌న్న సాయి ధ‌న్సిక కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `షికారు`. తేజ్ - అభిన‌వ్ - న‌వ‌కాంత్ - హ‌రి కొల‌గాని - శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. హ‌రి కొల‌గాని రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని శ్రీ‌సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై పీఎస్ ఆర్ కుమార్ నిర్మించారు. త్వ‌ర‌లో రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైల‌ర్ ని స్టార్ డైరెక్ట‌ర్ వీవీవినాయ‌క్ గురువారం విడుద‌ల చేశారు.

హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రం ఆద్యంత‌వం ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో సాగనుంది. భ‌ర్త వ‌య‌సు మ‌ళ్లిన పోలీస్ ఆఫీస‌ర్ కావ‌డంతో యంగ్ ఏజ్ లో వున్న దేవిక బాబి అనే యంగ్ టీజ‌ర్ తో ప్రేమ‌లో ప‌డుతుంది.

ఒక‌రోజు బాబీని ఇంటికి పిలిచి ఎంజాయ్ చేయాల‌నుకుంటుంది. ఆ క్ష‌ణంలోనే త‌న పోలీసు భ‌ర్త ఎంట్రీ ఇవ్వ‌డంతో బాబీని బాత్రూమ్ లో దాచేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  బాబీ బాత్రూమ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా? .. చివ‌రికి ఏం జ‌రిగింది? అన్న‌దే అస‌లు క‌థ‌.

`మేము న‌లుగురం ఫ్రెండ్స్ సార్ ఎక్క‌డికి వెళ్లినా న‌లుగురం క‌లిసే వెళ‌తాం. నాలుగో వాడిపేరు బాబీసార్‌.. అనే వాయిస్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. ఎక్క‌డున్నావురా అంటే బాబీ దేవిక వాళ్ల బాత్రూమ్ లో అని చెబుతాడు.

ఇంత‌కీ దేవిక ఎవ‌రు? అమె వెన‌కున్న క‌థేంటీ? .. బాబీ దేవిక కోసం ఎందుకు వెళ్లాడు? .. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. బాబీ కార‌ణంగా అడ్డంగా బంధువుల ముందు బుక్కైన దేవిక .. బాబీని కాపాడేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేసింది? త‌నని తాను ఈ స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డేసుకుంది అన్న‌ది ఆస‌క్తిక‌రం.

దేవిక పాత్ర‌లో సాయి ధ‌న్సిక న‌టించగా బాబీ పాత్ర‌లో తేజ్ న‌టించాడు. కీల‌క పాత్ర‌లో సాయి ధ‌న్సిక భ‌ర్త‌గా కిషోర్ న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో అన్న‌పూర్ణ‌మ్మ‌, సురేఖా వాణి, చ‌మ్మ‌క్ చంద్ర‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌చ్చ ర‌వి క‌నిపించారు. కామెడీ అంశాల్ని జోడించిన రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్ర  ట్రైల‌ర్ నెట్టింట సంద‌డి చేస్తోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు.


Full View
Tags:    

Similar News