ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు పెద్ద కొడుకు రానా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ని హీరోగా లాంఛ్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో సీనియర్ దర్శకుడు వంశీ చేతుల మీదుగా దగ్గుబాటి వారసుడిని పరిచయం చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 'పెళ్లి చూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో అభిరామ్ లాంచింగ్ ఉంటుందని టాక్ నడిచింది. అలానే విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబుతో అభిరామ్ డెబ్యూ మూవీ చేస్తారని రూమర్స్ వచ్చాయి. అయితే ఇంతవరకు నటవారసుడి ఎంట్రీపై సరైన కార్లిటీ రాలేదు.
ఈ నేపథ్యంలో రానా తమ్ముడు అభిరామ్ లాంఛింగ్ కి అంతా సెట్ అయిపోయిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ తేజ చేతుల మీదుగా అభిరామ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని రామానాయుడు స్టూడియో వర్గాలు చెబుతున్నాయి. వర్సటైల్ దర్శకుడు తేజ ఇప్పటివరకు ఉదయ్ కిరణ్ - నితిన్ - సదా - అనిత - రీమాసేన్ - ఆది పినిశెట్టి - నవదీప్ - ప్రిన్స్ వంటి ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలానే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటి హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ క్రమంలో తేజ ఇప్పుడు సురేశ్ బాబు చిన్న కొడుకుని హీరోగా లాంచ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.