అందాల రాక్షసి సినిమా తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి కెరీర్ ఆరంభంలో వరుస సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో మాత్రం ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. హీరోయిన్ గా ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ లక్ ను పరీక్షించుకుంటున్న అందాల రాక్షసి త్వరలో 'హ్యాపీ బర్త్ డే' సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
హ్యాపీ బర్త్ డే సినిమా తో మొదటి సారి లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్న లావణ్య త్రిపాఠి జులై 15వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హ్యాపీ బర్త్ డే టీజర్ ను జూన్ 7వ తారీకున ఉదయం 11.07 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. లావణ్య ను గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమాలో చూడబోతున్నట్లుగా పోస్టర్స్ ను చూస్తుంటే అనిపిస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు వచ్చిందట. జూలై 15వ తారీకున ఈ సినిమా ను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా టీజర్ డేట్ ను ప్రకటించడంతో లావణ్య త్రిపాఠి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోస్టర్ లో గన్ పట్టుకుని లావణ్య త్రిపాఠి ఫోజ్ ఇవ్వడంతో సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చింది.
మత్తు వదలరా దర్శకుడు రితేష్ రానా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను క్లాప్ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. హ్యాపీ బర్త్ డే ఫిల్మ్ ను చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ వారు చెబుతున్నారు.
చావు కబురు చల్లగా సినిమా తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి నటిగా మంచి పేరు దక్కించుకున్న లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డే సినిమా పై చాలా హోప్స్ పెట్టుకుంది.
ఈ మద్య కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఈ అమ్మడు చేస్తున్న హ్యాపీ బర్త్ డే సినిమా పై అందరి దృష్టి ఉంది. ఖచ్చితంగా మంచి వసూళ్లను కూడా ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తుంది.