కంపోజర్ తో లావణ్య వంద శాతం లవ్

Update: 2017-06-02 13:18 GMT
ఇప్పుడున్న హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో లావణ్య త్రిపాటి నేమ్ కూడా టాప్ 5 లో ఉంటుంది. అయితే అమ్మడు ఈ మధ్యన కాస్త ఒళ్ళు చేయడం.. అలాగే హిట్లు ఈమెకు మొఖం చాటేయడం జరుగుతోంది. అదిగో మొన్ననే శర్వానంద్ 'రాధ' కోసం ఎంత గ్లామరసం పండించినా కూడా.. సినిమా ఎందుకో వర్కవుట్ కాలేదు. దానితో లావణ్య మీద కూడా ప్రెజర్ ఎక్కువైంది. అప్పటికే మిస్టర్ స్ర్టోక్ తినేసింది కదూ.. అందుకే కాస్త గాబరాపడుతోందట.

ఇకపోతే లావణ్య సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ.. ఎందుకో ఆమెకు ఆఫర్లు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. బహుశా ఆమె క్యూట్ లుక్స్.. ఈ మధ్యనే హాటుగా కనిపించడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పడం.. అలాగే నటిగా కూడా పర్వాలేదని అనిపించుకోవడం.. ఆమెకు కలిసొస్తున్నట్లున్నాయి. అందుకే ఇప్పుడు తమిళంలో కంపోజర్ జివి ప్రకాష్‌.. అదేనండీ ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడు.. హీరోగా రూపొందనున్న 100% లవ్ సినిమా తమిళ రీమేక్ కోసం.. వంద శాతం ఈ అమ్మాయి ఐతే బాగుంటుందని అనుకుంటున్నారట.

నిజానికి తెలుగులో 100% లవ్ సినిమా మిల్కీ బ్యూటి తమన్నా కెరియర్ కు సూపర్ బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె అభినయం బాగుంటుంది అలాగే సెక్సీనెస్ కూడా పిచ్చి పీక్స్ లో చూపించాడు సుకుమార్. అందుకే ఈ సినిమా తమిళ వర్షెన్ లవాణ్య సాంబార్ ల్యాండ్ లో కూడా తన మార్కెట్ ను విపరీతంగా పెంచుకోవచ్చనే యోచనలో ఉందట. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News