అప్ప‌టికింకా నా వ‌య‌సు ప‌దిహేడే

Update: 2015-09-06 18:11 GMT
మిరుమిట్లు గొలిపే న‌వ్వుల‌తో మ‌న‌సు దోచేసే టెక్నిక్ ఎలానో లావ‌ణ్య త్రిపాఠి ని అడిగి తెలుసుకోవాల్సిందే. ఈ అమ్మ‌డు భ‌లే భ‌లే మ‌గాడివోయ్ స‌క్సెస్‌ ని ఆస్వాధిస్తోంది. ఈ హుషారులోనే వ్య‌క్తిగ‌త సంగ‌తుల్ని ఇలా ముచ్చ‌టించింది.

''మాది డెహ్రాడూన్. అమ్మ టీచ‌ర్‌. నాన్న లాయ‌ర్‌. నాకో అన్న‌య్య‌, అక్క ఉన్నారు. సాంప్ర‌దాయ బ్రాహ్మ‌ణ కుటుంబ‌మే అయినా అమ్మా నాన్న నాకు కావాల్సినంత స్వేచ్ఛ‌నిచ్చారు. డెహ్రాడూన్‌ లో స్కూలింగ్ పూర్త‌య్యాక పై చ‌దువుల కోసం ముంబై వ‌చ్చాను. అక్క‌డ నేష‌న‌ల్ కాలేజీలో డిగ్రీ  చేరాను. అప్ప‌టికి కేవ‌లం చ‌దువొక్క‌టే ల‌క్ష్యం . మోడ‌లింగ్‌, సినిమాలు ఆలోచ‌న‌లో లేనేలేవు''

''2006లో మిస్ ఉత్త‌రాఖండ్ పోటీల‌కు వెళ్లాను. స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా  వెళ్లా. ఒక్కో మెట్టు ఎక్కుతూ అలా ముందుకెళ్లిపోయా. కిరీటం అందుకున్నా. అప్ప‌టికింకా నా వ‌య‌సు 17 ఏళ్లే. గెలుపు నాలో కాన్ఫిడెన్స్ పెంచింది. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఎలా అయినా ఎదిగేందుకు ఉప‌యోగించుకోవాల‌నుకున్నా. పాండ్స్‌, ఫెయిర్ అండ్ ల‌వ్‌ లీ, మారుతి ఆల్టో ప్ర‌క‌ట‌న‌ల్లో ఛాన్స్ వ‌చ్చింది. ఓ హిందీ సీరియ‌ల్‌ లోనూ న‌టించాను. హీరోయిన్‌ గా ట్రై చేయ‌మ‌ని స్నేహితులు, ద‌ర్శ‌కులు సూచించారు. అలా  సినీప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాను. అందాల రాక్ష‌సి, దూసుకెళ్తా.. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నా. ఈ ప్రాసెస్‌ లో అమ్మా నాన్న‌ల నుంచి ప్రోత్సాహం ద‌క్కింది. స్వేచ్ఛ‌ నిచ్చి ఎంక‌రేజ్ చేశారు. ఇక్క‌డ నా గెలుపు అమ్మానాన్న‌ల‌కు బోలెడంత సంతోషాన్నిస్తోంది'' అంటూ అస‌లు సంగ‌తిని చెప్పింది అందాల రాక్ష‌సి.

ఈరోజు మీడియాతో ఈ విషయాలన్నీ పంచుకున్న అమ్మడి కళ్ళలో భలే భలే మగాడివోయి తాలూకు సక్సెస్‌, ఆ సక్సెస్‌ తాలూకు ఆనందం, బాగానే కనిపిస్తోంది.. అమ్మడు ఇక తదుపరి సినిమాలతో ఇంకా పెద్ద హిట్టు కొట్టేసి టాప్‌ రేంజుకు వచ్చేస్తుందని ఆశిస్తోంది. బెస్టాఫ్‌ లక్‌ బేబీ!!!
Tags:    

Similar News