సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ముఖ్యంగా కొత్త వారికి.. బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు చాలా అరుదగా వస్తాయి. అయితే వాటిలో మంచి ఏదో చెడు ఏదో చూసుకుని చేసిన వారికే స్టార్ డం దక్కుతుంది. ఆ సమయంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కెరీర్ లో చాలా నష్టపోవాల్సి వస్తుంది. చాలా మంది హీరోలు.. హీరోయిన్స్ మంచి కథలను.. పాత్రలను.. సినిమాలను వదిలేసిన దాఖలాలు ఉన్నాయి.
చిన్న చిత్రంగా విడుదలై 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'గీత గోవిందం' సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం మొదట లావణ్య త్రిపాఠి వద్దకు వచ్చింది. ఏవో కారణాలు చెప్పి ఆమె నో చెప్పింది. ఆ తర్వాత అను ఎమాన్యూల్ వద్దకు గీత పాత్ర వెళ్లింది. కాని గీత అయ్యేందుకు అను కూడా ఆసక్తి చూపలేదు. చివరకు రష్మిక గీత గోవిందంలో హీరోయిన్ గా నటించింది. గీత గోవిందం సినిమాలో నటించిన తర్వాత రష్మిక కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుందో చెప్పుకోవచ్చు. గీత గోవిందం సినిమాను కాదన్న లావణ్య త్రిపాఠి మరియు అను ఎమాన్యూల్ లు ఫేడ్ ఔట్ అయ్యే పరిస్థితికి వచ్చింది.
లావణ్య త్రిపాఠి నటించిన 'అర్జున్ సురవరం' ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సందర్బంగా లావణ్య త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గీత గోవిందం సినిమా చేయనందుకు నేను ఎప్పటికి బాధ పడుతూనే ఉంటాను. ఆ సినిమాను వదులుకోవడం చాలా పెద్ద తప్పుగా నేను భావిస్తున్నాను. అయితే ఆ సమయంలో నా చేతిలో లేని పని. అందుకే ఆ సినిమా వదులుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆఫర్లు వస్తున్నా కూడా మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.