ఈ సడెన్‌ స్కిన్‌ షో కి కారణమేంటి?

Update: 2015-07-29 05:27 GMT
ఇద్దరు ప్రియుల మధ్య నలిగిపోయే నారీమణిగా నటించింది లావణ్య త్రిపాఠి. కుర్రాళ్ల గుండె దోచే అందాల రాక్షసి అన్న పేరు తెచ్చుకుంది. తొలి సినిమాతోనే క్యూట్‌ హీరోయిన్‌, పద్ధతైన అమ్మాయి, సాంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది.. అన్న పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా లావణ్య చాలా సినిమాల్లో ట్రెడిషనల్‌ లుక్‌ లోనే కనిపించింది. కట్టు, బొట్టు, వ్యవహారికంలో అంత పెద్ద మార్పేమీ లేదు. కానీ అనూహ్యం.. ఇప్పుడు ఈ భామలోని ట్రాన్స్‌ ఫర్మేషన్‌ చూస్తుంటే అసాధారణం అనిపిస్తోంది. స్కిన్‌ షోల్లో శ్రీయ, బిపాసాల్నే కొట్టేట్టు కనిపిస్తోంది.

లావణ్యంలో ఉన్నట్టుండి లవణీయత పెరిగిపోయిందేంటో? ఉన్నట్టుండి ఆ స్కిన్‌ షోకి కారణమేంటో అర్థంగాక కుర్రాళ్లు జుత్తు పీక్కుంటున్నాడు. నాభి కేంద్రం, టైట్‌ ఫిట్‌ టాప్‌ తో చాలా హాట్‌ గా కనిపించింది నిన్నటిరోజున ప్రచారంలో. నాని భలే భలే మగాడివోయ్‌ చిత్రంలో గ్లామర్‌ డోస్‌ కాస్త పెంచినట్టే కనిపిస్తోంది. నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ఎంపికైన తర్వాతి నుంచే ఈ మార్పు అనుకోవాలేమో. మరి అనుష్కకు నూరి పోసినట్టు కింగ్‌ ఈ అమ్మడికి కూడా ఏదైనా కొత్తగా నూరిపోశాడా? లేదూ స్వతహాగానే ఈ అమ్మడిలో పట్టుదల పెరిగిందనుకోవాలా? టాలీవుడ్‌ కి ఓ ఇలియానా కరువైంది కాబట్టి ఆ ప్లేసును తను రీప్లేస్‌ చేయాలని కలలు గంటోందో? ఏమో, ఆల్రెడీ మెగా క్యాంపులో శిరీష్‌ ప్రక్కనే చోటు పట్టేసింది కూడా. ఆల్‌ ది బెస్ట్‌ 'లావా'ణ్య.
Tags:    

Similar News