డబ్బు ఇంపార్టెంట్‌.. అస్సలు కాదంటోంది

Update: 2016-01-24 19:30 GMT
మొన్ననే భలే భలే మగాడివోయ్‌ హిట్టయ్యింది. ఇప్పుడేమో సోగ్గాడే చిన్ని నాయనా హిట్టయ్యింది. సో.. ఇప్పుడు తక్షణం చేయాల్సిన పనేంటి? ఏముంది రెమ్యూనరేషన్‌ పెంచేయడమే. సరిగ్గా అదే ఫాలో అవుతోంది లావణ్య త్రిపాఠి. మినిమం 50 లక్షలు మ్యగ్జిమం ఒక 75 అంటోందని ఫిలిం నగర్‌ టాక్‌. ఇదే విషయాన్ని అమ్మడిని అడిగితే ఏమంటోందో తెలుసా??

''నా జీవితంలో డబ్బుకి అంత ప్రాధాన్యం ఇవ్వను. మోడలింగ్‌ చేస్తున్నప్పటి నుంచీ అంతే. ఇప్పుడు నాకు కథ, నా పాత్రే ముఖ్యం. డబ్బుల కోసం సినిమాల్ని ఒప్పుకోను. నా పారితోషికం నా దగ్గర ఉంచుకోను. ఎంతొస్తే అంత అమ్మ చేతిలో పెట్టేస్తా. నాకు షాపింగ్‌ వ్యామోహం తక్కువే'' అంటూ సెలవిచ్చింది అందాల రాక్షసి.  ప్రస్తుతం చేస్తున్న శిరీష్‌ సినిమా తరవాత కొంతకాలం విరామం తీసుకొందామని అనుకుంటోందట. ఆ సమయం మొత్తం నా కోసం, నా కుటుంబం కోసం కేటాయిస్తా... ఏదైనా ఫారిన్‌ ట్రిప్‌ వెళతా.. అంటూ చెప్పుకొచ్చింది.

కాని ఫిలిం నగర్‌ లో మాత్రం.. ఇలా గ్యాప్‌ తీసుకొని.. ఎవరు ఎక్కువ పే చేస్తే వారి సినిమాను ఓకే చేసేలా ఉంది అంటూ చెబుతున్నారు. అంతేలే.. నాలుగు అవకాశాలు కలిసొచ్చినప్పుడే ఫీజు పెంచాలి. లేకపోతే ఫ్రీగా చేస్తానన్నా కూడా మొన్నటివరకు ఐరన్‌ లెగ్ అంటూ పక్కనెట్టేయలేదు.
Tags:    

Similar News