దర్శకుడిగా... డ్యాన్స్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతులే కాదు... సేవా కార్యక్రమాల్ని నిర్వహించటం లో మంచి పేరున్న లారెన్స్ రాఘవకు షాక్ తగిలే ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. లారెన్స్ మాష్టర్ సోదరుడు పాడుపని చేసినట్లుగా ఒక మహిళ ఆరోపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యాన్సర్ గా... జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న 29 ఏళ్ల ఒక యువతిని తనను మోసగించినట్లుగా వాపోతోంది. తాజాగా ఒక ప్రముఖ చానల్ ను ఆశ్రయించిన ఆమె చెప్పిన మాటల్ని వింటే అవాక్కు అవ్వాల్సిందే.
ప్రేమ పేరుతో లారెన్స్ తమ్ముడు ఎల్విన్ తనను వేధింపులకు గురి చేస్తే... దానికి సంబంధించిన కంప్లైంట్ పోలీసులకు ఇస్తే వారు ఆరేళ్లుగా తనను వేధిస్తున్నట్లుగా సంచలన ఆరోపణలు చేశారు. ఆరేళ్ల క్రితం మారేడ్ పల్లి ఇన్ స్పెక్టర్ గా పని చేసి ప్రస్తుతం ఏసీపీగా వ్యవహరిస్తున్న రవీందర్ రెడ్డితో కలిసి ఎల్విన్ తనను దారుణమైన వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె పేర్కొంటున్నారు.దీనిపై సదరు పోలీసు అధికారి స్పందిస్తూ సదరు మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లుగా చెప్పారు. అయితే... ఎల్విన్ తో సదరు యువతికి వివాదం ఉందన్న విషయాన్ని పేర్కొనటం గమనార్హం.
తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బ్రోతల్ కేసులో ఇరికించి 21 రోజులు జైల్లో ఉండేలా చేశారని చెప్పింది. సదరు చానల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఏమేం చెప్పారన్నది ఆమె మాటల్లో..
% మాది వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో హైదరాబాద్‌లో పెద్దమ్మ దగ్గర పెరిగాను. బాల్యంలో నేర్చుకున్న నృత్యం, కరాటేతో సినిమా ఛాన్సులు వచ్చాయి. పలు సినిమాల్లో చిన్న పాత్రలు చేశాను. కొన్ని ప్రకటనలకు మోడల్‌గా పనిచేశా.
% ఓ సినిమా షూటింగ్ సమయంలోనే ఎల్విన్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నా అంటూ ప్రపోజ్ చేశాడు. నో చెప్పటంతో కక్ష కట్టాడు. తాను తలచుకుంటే పెద్ద పెద్ద హీరోయిన్‌లే తన ముందు వాలిపోతారని.. అలాంటిది నువ్వో లెక్క? అంటూ బెదిరింపులకు దిగాడు.
% దీంతో.. అప్పటి మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశా. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత రవీందర్ రెడ్డి నుంచి వేధింపులు మొదలయ్యాయి. విచారణ పేరుతో నన్ను కాటేజీలు, లాడ్జిలకు రమ్మనేవాడు. నీచంగా మాట్లాడేవారు.
% తప్పనిపరిస్థితుల్లో మకాం మార్చి, రహస్యంగా తలదాచుకున్నా. అక్కడా కుట్ర చేశారు. బ్రోతల్ కేసు పెట్టారు. ఒకరోజు కానిస్టేబుల్ వచ్చి వెస్ట్ మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ రవిందర్‌రెడ్డి రమ్మంటున్నారంటే వెళ్లా. అక్కడికి వెళ్ళగానే పోలీసులు తెల్లకాగితం మీద సంతకం పెట్టమని బలవంతం చేశారు. పెట్టనంటే.. బలవంతంగా పెట్టించారు.
% ఆ సంతకమే నా జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని అప్పుడు అనుకోలేదు. నేరుగా గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఏవో పరీక్షలు చేయించి, కోర్టులో హాజరుపరిచారు. తర్వాత జైలుకు తీసుకెళ్ళారు. 21 రోజులు జైల్లోనే ఉన్నాను. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ మీద విడుదలయ్యాను.
% పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టేందుకు వెళ్ళినపుడు... ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి వెకిలిగా నవ్వుతూ అర్థమైందా... డబ్బులున్నోళ్లతోనూ... నాలాంటోళ్లతో పెట్టుకుంటే ఇలానే అవుతుందంటూ అవమానించాడు. కోర్టు వాయిదాల వివరాలు తెలీయనీకుండా కుట్ర చేసి మరోసారి జైలుకు వెళ్లేలా చేశారు.
% ఇవన్నీ వదిలేసి నా బతుకు బతుకుదామనుకుంటే ఎల్విన్... రవీందర్ రెడ్డి గ్యాంగులు ఇప్పటికి వెంటాడుతున్నాయి. జేఎన్ టీయూ హాస్టల్ సమీపంలో ఉంటే... నా రూము మీద దాడి చేసి ల్యాప్ టాప్.. సెల్ ఫోన్ తీసుకెళ్లారు. తిండికి ఇబ్బంది పడుతూ.. మిత్రుల సాయంతో కాలం వెళ్లదీస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన విషయాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించాల ని ఆమె కోరుతున్నారు. తనను ఇంతలా వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు.