చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు సినిమాను లారెన్స్ రీమేక్ చేస్తున్నాడహో అంటూ ప్రచారం మొదలైపోయింది. రజినీకాంత్ నటించిన మూండ్రు ముగమ్(1982) అనే తమిళ్ మూవీని లారెన్స్ రీమేక్ చేస్తుండగా.. చిరంజీవి సినిమా రీమేక్ చేస్తున్న లారెన్స్ అంటూ వెబ్ సైట్లు.. ఛానళ్లలో హంగామా రచ్చ రచ్చ స్టార్ట్ చేసేశాయి. ఇదంతా ఎందుకంటే.. ఇన్ఫర్మేషన్ సైట్ అయిన వికీపీడియాలో ఈ పాయింట్ ఉండడమే.
ఈ మూండ్రు ముగమ్ నే చిరంజీవి తెలుగులో రీమేక్ చేశారన్నది ఆయా వార్తల సారాంశం. పేరు మ్యాచ్ అయితే చాలు.. అందులో నిజానిజాలతో సంబంధం లేకుండా వార్తలు రాసేసుకోవడం చాలామందికి అలవాటైపోయింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రజినీకాంత్ మూండ్రు ముగమ్ ను తెలుగులో ముగ్గురు మొనగాళ్లుగా రీమేక్ చేయడం వాస్తవమే. కానీ అది.. చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు కాదు. 1983లో వచ్చిన శోభన్ బాబు సినిమా ముగ్గురు మొనగాళ్లు. అప్పట్లో అంటే రజినీ ఇంకా సూపర్ స్టార్ కాకమునుపు చేసిన మూండ్రు ముగమ్ బ్లాక్ బస్టర్ అయితే.. దాన్ని తెలుగులో శోభన్ బాబు రీమేక్ చేశారు.
ఆ తర్వాత 11 ఏళ్లకు.. అంటే 1994లో మెగాస్టార్ కూడా ముగ్గురు మొనగాళ్లు టైటిల్ పై సినిమా చేశారు. కానీ ఇది డైరెక్ట్ మూవీనే. ఆ విషయం తెలియక.. ముగ్గురు మొనగాళ్లు అనే టైటిల్ మ్యాచ్ కాగానే హంగామా చేసేశారు. అఫ్ కోర్స్.. వికిపీడియోలో కూడా అదే ఉంది. అయినా.. వికిపీడియాలో ఉన్నదంతా నిజమే అనుకునే మహానుభావులు ఉండబట్టే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయ్.
ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పుకోవాలి. అదే వికిపీడియాలో.. మూండ్రు ముగమ్.. చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు సినిమాలకు స్టోరీ డీటైల్డ్ గా ఉంది. ఒక్కరంటే ఒక్కరు కూడా పొరపాటున కూడా ఆ కాపీ చదవకుండానే.. ఇలా చిరంజీవితో లింక్ పెట్టి పులిహోర వండేసుకున్నారు. రజినీ చేసే మూడు పాత్రల్లో ఒకటి తండ్రి- ఇద్దరు కవలలు. చిరు సినిమాలో ముగ్గురూ అన్నా దమ్ములే. ఆ పాయింట్ కూడా తెలియకుండా.. తెలుసుకోకుండా చిరంజీవి పేరుతో లింక్ ఉంది అనగానే.. ఆర్టికల్స్.. స్టోరీస్ దంచికొట్టేస్తున్నారు.
పేరు మ్యాచ్ అయితే చాలు.. అందులో చిరంజీవికి ఏదైనా లింక్ ఉంటే చాలు.. ఇలాంటి హంగామాలు నడుస్తూనే ఉంటాయ్ లే.. ఈ సారైనా.. కాస్త ఏ సినిమా ఏదో తెలుసుకుని రాయండి రాజాస్!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/