కమల్ పోస్టర్ మీద పేడ కొట్టిన వైనాన్ని రివీల్ చేసిన లారెన్స్

Update: 2019-12-09 04:41 GMT
మంచి ఉద్దేశంతోనే మనం చెప్పొచ్చు. కానీ.. విని అర్థం చేసుకొనే పరిస్థితి ఉండాలి. సంచలనాలే కేరాఫ్ అడ్రస్ గా నిలిచి మీడియా.. సోషల్ మీడియాలు చెలరేగిపోతున్న వేళ సెలబ్రిటీలు తొందరపడితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తాజాగా దర్శకుడు లారెన్స్ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఆచితూచి మాట్లాడకుంటే సెలబ్రిటీలకు తిప్పలు తప్పవన్న హెచ్చరికలు పలు ఉదంతాల్ని చూసిన తర్వాత కూడా గుర్తించరా అంటూ పలువురు మండిపడుతున్నారు.

తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలోనూ లారెన్స్ మాస్టర్ అంటే అందరూ అభిమానిస్తారు. ఆయన చేసే సామాజిక కార్యక్రమాల్ని పలువురు ప్రశంసిస్తారు. ఇదంతా ఓకే అయినా.. తాజాగా తాను పొల్గొన్న ఒక మీటింగ్ లో తాను చిన్నప్పుడు చేసిన ఒక పనిని చెప్పి ఇప్పడు అడ్డంగా బుక్ అయ్యారు. మా నాయకుడి మీద అలాంటి కామెంట్లు చేస్తావా? అంటూ చెలరేగిపోతున్నారు. దీంతో.. తల పట్టుకోవటం లారెన్స్ వంతైంది.

తమిళ సూపర్ స్టార్ రజనీ తాజాగా నటించిన దర్బార్ ఆడియో రిలీజ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు లారెన్స్ హాజరయ్యారు. రజనీకి వీరాభిమాని అయిన లారెన్స్.. గురువు మీద తనకున్న అభిమానాన్ని చెప్పుకొస్తూ.. మరో అగ్రనటుడు కమల్ ఫ్యాన్స్ చిన్నబోయే ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడదే వివాదంగా మారింది.

తాను చిన్నతనం నుంచి రజనీ అభిమానినని.. చిన్నప్పుడు గోడ మీద కమల్ సార్ పోస్టర్ కనిపిస్తే ఆవుపేడ తీసి కొట్టిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ.. ఈ రోజున వీళ్లిద్దరూ చేయి.. చేయి కలుపుకొని నడుస్తుంటే చూసేందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. లారెన్స్ స్పీచ్ మొత్తాన్ని వదిలేసి.. సరిగ్గా పేడ సీన్ వరకూ కట్ చేసిన వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పెట్టేయటం.. అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో.. కమల్ అభిమానులు లారెన్స్ పైన గుస్సా అవుతున్నారు.

దీంతో.. సమస్యను గుర్తించిన లారెన్స్ సోషల్ మీడియా ద్వారా భారీ వివరణ ఇచ్చుకున్నారు. కమల్ సార్ పోస్టర్ మీద తాను పేడ కొట్టిన వైనంపై ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారని.. తనను నాలుగు మాటలు అనే ముందు వీడియో మొత్తం చూడాలని కోరుతున్నారు. చిన్నతనంలో చేసిన పనిని చెప్పానేకానీ.. తనకు కమల్ సార్ అంటూ అపారమైన గౌరవంగా చెప్పుకున్నారు. మాట అనే ముందు కాస్త ఆలోచించుకొని అంటే.. ఈ రోజున ఇన్నేసి వివరణలు ఇవ్వాల్సి వచ్చేదే కాదు కదా
Tags:    

Similar News