బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా రూపొందిన స్వాతిముత్యం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. కలెక్షన్స్ విషయంలో కొన్ని కారణాల వల్ల నిరాశ పర్చినా కూడా సినిమాకు రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి.. మౌత్ టాక్ కూడా బాగానే ఉందని వచ్చింది.
స్వాతిముత్యం కి లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించాడు. సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో రూపొందిన స్వాతిముత్యం సినిమా సందడి ఇంకా కొనసాగుతున్న సమయంలోనే దర్శకుడు లక్ష్మణ్ కే కృష్ణ కి మరో సినిమా ఆఫర్ దక్కిందనే వార్తలు వస్తున్నాయి.
తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సీనియర్ హీరో వెంకటేష్ కోసం ఈ యంగ్ డైరెక్టర్ ఒక కథను సిద్ధం చేశాడట. ఆ కథ ను ఇటీవల నిర్మాత సురేష్ బాబు వినడం.. ఆయన కి కథ బాగా నచ్చడంతో వెంటనే వెంకటేష్ ను వినాలని చెప్పడం జరిగిందట. వెంకీ విన్న తర్వాత సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందని అంటున్నారు.
వినోదాత్మకంగా సాగే ఈ కథ లో హీరో మిస్ అయిన తన భార్య కోసం వెతుకుతూ ఉంటాడట. అసలు భార్య ఎలా మిస్ అయ్యింది.. భార్య ను వెతికే కథలో దర్శకుడు ఎలా ఫన్ ను క్రియేట్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.
స్టోరీ లైన్ చాలా విభిన్నంగా ఉండటంతో తప్పకుండా వెంకటేష్ కి ఈ సినిమా నప్పుతుందని సినీ విశ్లేషకులు బలంగా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.