ఆప్టర్ లాక్ డౌన్.. పోస్టుతో భారీగా పంచ్ లు వేసిందిగా?

Update: 2020-04-03 05:10 GMT
కరోనా.. లాక్ డౌన్ .. ఈ రెండు మాటలే ఎక్కడ చూసినా. మిగిలిన భిన్నంగా ఆఫ్టర్ లాక్ డౌన్ ఏం జరుగుతుంది? ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు? లాంటి ప్రశ్నలకు సమాధానంగా హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్టర్ లాక్ డౌన్ విషయంలో తనతో ఒక డాక్టర్ చెప్పిన విషయాల్ని వెల్లడిస్తూ.. ఒక భారీ పోస్టును పెట్టేసింది. ఇందులో పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించింది లక్ష్మీరాయ్.

ఆమె పెట్టిన పోస్టు చూస్తుంటే.. జనతా కర్ఫ్యూ వేళ దేశ ప్రజలు స్పందించిన తీరు ఆమె మీద పెను ప్రభావం చూపినట్లుగా అనిపించక మానదు. ఇంతకీ ఆమె పెట్టిన పోస్టులో కీలకాంశాలు ఏమున్నాయన్నది చూస్తే..

%  లాక్ డౌన్ పూర్తయ్యాక దేశ భక్తితో కొందరు రోడ్ల మీదకు వచ్చిన కరోనా యుద్ధాన్ని గెలిచామని పెద్ద పెద్దగా అరుస్తారు. దేశభక్తి  గీతాల్ని అలపిస్తూ.. జాతీయ జెండాను పట్టుకొని రోడ్ల మీదకు వచ్చిన మరికొందరు విచ్చలవిడిగా వాహనాల్ని నడుపుతారు.

% విద్యావంతులమని చెప్పుకునే కొందరు లాక్ డౌన్ పూర్తి అయిన వెంటనే.. సినిమా హాల్స్.. మాల్స్..  వినోదాల్లో మునిగి తేలేలా చేస్తారు. లాక్ డౌన్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటానికి కొన్ని కంపెనీలు.. తమ ఉద్యోగుల్ని ఎక్కువగా పని చేయాలని కోరవచ్చు. దీని కారణంగా.. ఉద్యోగులు ఒత్తిడికి గురి కావొచ్చు.

% కరోనాకు భయపడి సొంతూళ్లకు చేరుకున్న వారు తిరిగి తమ వ్యాపారాలు.. ఉద్యోగాల్ని చేసుకునేందుకు వీలుగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టును విచ్చలవిడిగా వాడేయొచ్చు.

% ఎవరికి వారు తమ సాధారణ జీవితాల్ని షురూ చేయొచ్చు.ఇప్పటికే 21 రోజులు క్వారంటైన్ లో ఉన్నామని శానిటైజర్లు.. మాస్కుల్ని పక్కన పెట్టేయొచ్చు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు.

% కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నా.. అవగాహన లేకున్నా.. కరోనా పరీక్షలు చేయించుకోకుండా జనసంద్రంలో తిరిగినా.. మళ్లీ వైరస్ ప్రబలే ప్రమాదం పొంచి ఉంటుంది. అదే జరిగితే మరోసారి ప్రజలంతా లాక్ డౌన్ పరిస్థితిని ఎదుర్కొని రావాల్సి రావొచ్చు.

%  21 రోజుల లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత కూడా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ కార్వంటైన్ జాగ్రత్తలు తప్పనిసరి. ఒకవేళ.. ఈ విషయంలో మన ఫెయిల్ అయితే..21 రోజుల పాటు చేపట్టిన లాక్ డౌన్ వేస్టు అవుతుంది. 22వ రోజున ప్రజారవాణా ఎలా ఉండాలన్న విషయంలో ప్రభుత్వాలు మరింత జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News