ప్రముఖ నటుడు సచిన్ జోషి తెలుగు లో 'మౌనమేలనోయి' సినిమాతో పరిచయమై ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు హీరోగా పనిచేశారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి దిగి సినిమాలను నిర్మించారు. సచిన్ జోషి ప్రముఖ వ్యాపారవేత్త కూడా. ఈయనకు అనేక వ్యాపారాలున్నాయి.
అయితే ఇటీవల కొన్ని నెలల క్రితం సచిన్ జోషిపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో అతడి ఆస్తులు జప్తు చేసి సచిన్ జోషిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి సచిన్ బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. తాజాగా సచిన్ జోషికి బెయిల్ మంజూరైంది. కొన్ని కండీషన్లతో ఈ బెయిల్ వచ్చింది. ముంబై హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి 30 లక్షల వ్యక్తిగత బాంబ్, అంత మొత్తానికి ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ ను ఇస్తూ కొన్ని బెయిల్ షరతులతో పాటు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ భారతదేశం విడిచి వెళ్లొద్దని కోర్టు తెలిపింది. నాలుగు నెలలు మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది.
ఇక గతంలోనూ సచిన్ జోషి గుట్కా అక్రమ రవాణా కేసులో బుక్కయ్యాడు. ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త, ప్రముఖ నటుడైన సచిన్ జోషిని ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత మార్చిలో హైదరాబాద్‌లో గుట్కాను అక్రమంగా ఉంచుకున్న కేసులో అతడిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఈ కేసులో అతడిని ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే నటుడు సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు తదుపరి విచారణ కోసం తీసుకెళ్లారు. సిఆర్‌పిసి సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చిన తరువాత అతన్ని వదిలిపెట్టారు.
ఈ కేసులో సచిన్ జోషి కోసం హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అంతర్జాతీయంగా విమానాల్లో ప్రయాణిస్తే అతడిని అదుపులోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సచిన్ జోషి ముంబై విమానాశ్రయంలో దిగిన క్షణంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జోషి దుబాయ్ నుంచి ముంబైకి వచ్చాడు. ప్రస్తుతం వదిలేసిన హైదరాబాద్ పోలీసులు అవసరమైతే మళ్లీ ప్రశ్నిస్తామని తెలిపారు.
గత మార్చిలో హైదరాబాద్‌లో సచిన్ జోషి నుంచి భారీగా గుట్కాను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. "లక్ష రూపాయల విలువైన 80 బాక్సులను సచిన్ జోషి నుంచి స్వాధీనం చేసుకున్నాం. అనుమానితులను ప్రశ్నించినప్పుడు, జోషి పేరు చెప్పారు. అతడిని ఈ కేసులో నిందితుడిగా చేశాం" అప్పటి నుంచి చిక్కకుండా విదేశాల్లో సచిన్ ఉన్నాడు. దేశానికి రాగా అరెస్ట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద బహదూర్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. జోషి దేశంలో లేకపోవడంతో అతడిపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశామని ఆ అధికారి తెలిపారు.
తెలుగులో హీరోగా సచిన్ జోషి పలు చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో కనిపించి మెప్పించారు. అతడి తీరు ప్రతీసారి వివాదాస్పదంగా ఉంది. ఇదివరకు వ్యాపారవేత్త-చిత్రనిర్మాత సత్యగ్ కంపెనీలో పెట్టుబడి వివాదంపై కోర్టులో వివాదం నడుస్తోంది.