ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' చిత్రం షూటింగ్ ప్రస్తుతం విశాఖ మన్యం ప్రాంతంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఈ షూటింగ్ లొకేషన్ నుండి ఒక వీడియో లీక్ కావడం.. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తెలిసిందే. RRR యూనిట్ కు సంబంధించిన సోషల్ మీడియా టీమ్ వెంటనే అప్రమత్తమైన ప్రధాన మీడియాలో ఆ లీక్ వీడియో సర్క్యులేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ట్విట్టర్.. ఫేస్ బుక్ హ్యాండిల్స్ లో కూడా వీడియోను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.
అయితే ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆ వీడియో మాత్రం వాట్సాప్ లాంటి చాటింగ్ యాప్స్ లో సర్క్యులేట్ అవుతోంది. దీంతో ఈ లీక్ వీడియో సంఘటనపై రాజమౌళి 'RRR' టీమ్ పై సీరియస్ అయ్యారట. ఇప్పటికే షూటింగ్ లొకేషన్ కు ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడంలేదు. ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారట. అనుమతి లేకుండా ఎవరూ షూటింగ్ లొకేషన్ లో ఉండేందుకు వీలు లేదని చెప్పారట. షూటింగ్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకునేలా ఒక టీమ్ ను ఏర్పాటు చేశారట.
RRR షూటింగ్ ప్రారంభమై చాలా రోజులయింది. నిజానికి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయినా ఇప్పటివరకూ ఎన్టీఆర్ లుక్.. చరణ్ లుక్ వారిద్దరి గెటప్ లకు సంబంధించిన స్టిల్స్.. పోస్టర్స్ ఇంతవరకూ అధికారికంగా విడుదల కాలేదు. వారి దుస్తులు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు తెలీదు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ గెటప్ బయటకు రావడం 'RRR' టీమ్ ను షాక్ కు గురి చేసిందని సమాచారం.