లెజెండరీ నటుడు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎంతమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి వచ్చినా ఆయన స్థానం ఎప్పటికీ అలానే ఉంటుంది. ఆయన తెర మీద కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల మొహాల్లో చిరునవ్వులు చిందుతాయి. ఇందుకే హీరో ఇంట్రడక్షన్ కు కూడా పడని విజిల్స్.. స్టార్ కమెడియన్ ఎంట్రీకి పడతాయి. పన్నెండు వందలకు పైగా సినిమాలు.. వందల పురస్కారాలు.. గిన్నిస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకున్న బ్రహ్మానందం.. తెలుగు సినిమాకే గర్వకారణం.
అయితే గత కొంతకాలంగా బ్రహ్మానందం వెండి తెర మీద ఎక్కువగా కనిపించడం లేదు. ఆ మధ్య ఆరోగ్య సమస్యలతో కొన్ని సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో కనిపించినా.. అవేవీ ఆయన రేంజ్ కు తగ్గ పాత్రలు కాదు.
అయితే బ్రహ్మీ ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. కాకపోతే ఎప్పటిలాగే మళ్ళీ స్క్రీన్ మీదకు వచ్చి మీమర్స్ కు కావాల్సినంత స్టఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వెండి తెరపై బాగా మిస్సవుతున్న లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఇప్పుడు 'పంచతంత్రం' తో పాటుగా 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో బ్రహ్మీ కనిపించనున్నారని స్వయంగా ఆయనే కంఫర్మ్ చేశారు. ఇటీవల అలీ హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షో లో పాల్గొన్న బ్రహ్మానందం.. ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా గ్యాప్ తర్వాత హాస్య బ్రహ్మ నటిస్తున్న పెద్ద సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిజానికి 'భీమ్లా నాయక్' ఒరిజినల్ వెర్సన్ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రంలో కామెడీకి ఆస్కారం లేదు. కాకపోతే తెలుగులో మన నేటివిటీకి సెన్సిబిలిటీస్ కు తగ్గట్లుగానే స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేర్పులు చేశారు.
ఈ క్రమంలోనే కామెడీని కూడా జత చేసినట్లు తెలుస్తోంది. గతంలో బ్రహ్మానందంతో అనేక సినిమాలు చేసిన దర్శకుడు.. ఇప్పుడు పవన్ సినిమాలో ఆయనకు ఎలాంటి పాత్ర రాశారు?, ఆ క్యారెక్టర్ లో బ్రహ్మీ మునుపటిలా ఆడియన్స్ ని నవ్విస్తారో లేదో చూడాలంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భీమ్లా నాయక్' చిత్రాన్ని జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.