తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే లెజండరీ దర్శకుడు ఒకరు.. నవరసాలు కలబోసిన చిత్రాలను తెరకెక్కించి కొన్ని దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అదీ ఇదీ అని కాకుండా అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు రూపొందించారు.
అందమైన దృశ్యకావ్యాలను తెరపై ఆవిష్కరించే దర్శకుడు.. ఒకప్పుడు కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అందుకే ప్రతీ హీరో కూడా ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఆశపడుతుంటారు.
టాలీవుడ్ లో అన్ని జనరేషన్ల టాప్ హీరోలందరితో సినిమాలు చేసి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనత ఆయనకే దక్కింది. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న చాలామంది హీరోలు స్టార్ స్టేటస్ అందుకుంది ఆయన సినిమాలతోనే.
ఎంతోమంది నటీనటులను ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను పరిచయం చేశాడు. ముఖ్యంగా ఎందరో హీరోయిన్లను తెలుగు తెర మీదకు తీసుకొచ్చారు. నటన నేర్పించి పరిశ్రమలో సముచిత స్థానం దక్కేలా చేసాడు.
కొత్త నీరు వచ్చిన తర్వాత పాత నీరు కొట్టుకుపోవడం సహజమే కాబట్టి.. ఇండస్ట్రీకి యంగ్ డైరెక్టర్స్ వస్తుండటంతో దిగ్గజ దర్శకుడు అవుట్ డేటెడ్ అయిపోయాడు. అయినప్పటికీ అప్పుడప్పుడు సెలెక్టివ్ గా తనకు కలిసొచ్చిన జోనర్లలో సినిమాలు చేస్తూ వచ్చాడు.
ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వకపోవడంతో ఫేడ్ అవుట్ అయ్యే దశకు చేరుకున్నాడు. దీంతో మెగాఫోన్ పక్కనపెట్టి, చాలాకాలంగా డైరెక్షన్ కు దూరంగా ఉంటున్నారు.
అయితే చిత్ర నిర్మాణాల్లో భాగం పంచుకుంటూ ఇండస్ట్రీలో యాక్టీవ్ గానే ఉంటూ వస్తున్నారు. సినిమా మీదున్న ఇష్టం వదులుకోలేక ఈ మధ్య మళ్ళీ దర్శకత్వం మీద దృష్టి పెట్టారు.
కాకపోతే ఈసారి డైరెక్టర్ చైర్ లో కూర్చోకుండా పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నాడు. తన మార్గనిర్దేశకత్వంలో ఇతర దర్శకులతో సినిమాలు చేయడం ప్రారంభించారు. అలానే కొన్ని చిత్రాలకు సమర్పకులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ.. దిగ్గజ దర్శకుడు ఎంపిక చేసుకుంటున్న సినిమాలపైనే సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. అంత పెద్ద దర్శకుడు నాసిరకం బి గ్రేడ్ చిత్రాలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
ఎవరో ఒకరిద్దరు నటీమణులకు లైఫ్ ఇవ్వాలని సినిమాలు చేయకుండా.. ప్రేక్షకులను అలరించే చిత్రాలు చేయాలని వెటరన్ డైరెక్టర్ కు సూచిస్తున్నారు. ఇప్పటి నుంచైనా తన స్థాయికి తగ్గ సినిమాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.