ఫారిన్ షూటింగ్స్ గుట్టు విప్పేసిన డైరెక్టర్

Update: 2016-09-20 07:30 GMT
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు చాలావరకు విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఒకప్పుడు పాటలు-లొకేషన్స్ వరకే పరిమితం కాగా.. ఇప్పుడు స్టోరీని కూడా విదేశాల్లో నడిపించేస్తున్నారు. టాలీవుడ్ లో ఈ కల్చర్ లేట్ గానే మొదలైనా.. బాలీవుడ్ ఓ పది-పదిహేనేళ్ల ముందు నుంచే ఈ పద్ధితి ఫాలో అయిపోతున్నారు. ఫారిన్ లొకేషన్స్ లో భారీగా ఖర్చుపెట్టి సినిమా తీస్తున్నామని గొప్పగా ప్రచారం కూడా చేసేసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ దీని వెనక దాగిన గుట్టును బాలీవుడు దర్శకుడు ప్రకాష్ ఝా విప్పేశాడు.

రీసెంట్ గా ప్రియాంక చోప్రాతో జై గంగాజల్ ను తెరకెక్కించిన ప్రకాష్ ఝా.. 'ఇండియాలో కంటే ఫారిన్ లోనే పిక్చరైజేషన్ కు తక్కువ ఖర్చు అవుతోంది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లడం కంటే.. యూరోప్ వెళ్లేందుకే ఖర్చు తక్కువ. యూరోప్ కంట్రీస్ లో జర్నీలకు ప్యాకేజ్ లు ఉంటాయి. ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీస్ లో ఇబ్బంది ఉండదు. షూటింగ్ జరిగే ప్రాంతానికి వచ్చి ఎవరూ ఇబ్బంది పెట్టరు. పర్మిషన్స్ తేలిగ్గా లభిస్తాయి' అంటూ కమర్షియల్ యాంగిల్ గుట్టు విప్పేశారు.

మన దేశంలో కంటే చెక్ రిపబ్లిక్ లో రికార్డింగ్ చేయించుకునేందుకు తక్కువ ఖర్చు అవుతుందని.. మంచి మ్యూజీషియన్లు ఉన్నారని ప్రకాష్ ఝా చెబుతున్నాడు. అన్ని సినిమాలు తీసిన ఓ బాలీవుడ్ దర్శకుడు ఇలా చెబుతున్నాడంటే.. విదేశాలకు వెళ్లి భారీగా ఖర్చుపెట్టేశాం అని చెప్పే కబుర్లన్నీ ఉత్తుత్తివే అన్నమాట.
Tags:    

Similar News