వివాహంతో జీవితకాల నరకం ఎందుకు?

Update: 2021-06-20 11:30 GMT
పెళ్లి శృంగారం స‌హా ఎన్నో విష‌యాల‌పై స్వేచ్ఛ‌గా త‌న అభిప్రాయాల్ని చెబుతున్నారు పూరి జ‌గ‌న్నాథ్. ఆయ‌న క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలో పూరి మ్యూజింగ్స్ ని బ్లాక్ బ‌స్ట‌ర్లుగా మ‌లిచారు. సెకండ్ వేవ్ లోనూ లాక్ డౌన్ సీజ‌న్ లో త‌న అనుభ‌వాల‌ను నాలెజ్ ని ప్రెజెంట్ చేస్తూ పూరి చెబుతున్న చాలా సంగ‌తులు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. సామాజిక మాధ్య‌మాల్లో పూరి పాడ్ కాస్ట్ లు వైర‌ల్ గా మారాయి. రెండో సిరీస్ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది.

తాజాగా `లైఫ్ ఆంథెమ్` పోడ్ కాస్ట్ లో జీవిత గ‌మ‌నంపై మాట్లాడారు. ప్ర‌తి ఒక్క‌రూ తమ జీవితాన్ని ఎలా గడపాలి అనే దానిపై విజ్ఞానాన్ని పంచారు. పూరి మరోసారి వివాహంపై వ్య‌తిరేక‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. ``మ‌న‌ జీవితం కేవలం మూడు రోజుల డ్రామా. అప్పుడు వివాహం ద్వారా మీకు జీవితకాల నరకం ఎందుకు అవసరం?`` అని ప్ర‌శ్నించారు.

అర‌వై వ‌చ్చాయ‌ని విరమించ‌కూడ‌ద‌ని.. కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. క్లైమాక్స్ బాగుంటే అది సూపర్ హిట్ అవుతుంది. మీ జీవితాన్ని బ్లాక్ బస్టర్ గా మ‌లుచుకోండి. ఇది తత్వశాస్త్రం కాదు.. క‌నీస‌ ఇంగితజ్ఞానం`` అని అన్నారు.




Full View
Tags:    

Similar News