లైగ‌ర్ గాళ్ ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయింది!

Update: 2022-08-08 16:30 GMT
ఆన్ లొకేష‌న్ ఎంజాయ్ చేస్తూ ప‌ని చేస్తే అలుపు సొలుపు ఏం ఉంటుంది?  అస‌లు ప‌ని చేస్తున్నామా లేదా? అన్న‌ది కూడా మ‌ర్చిపోతాం. అలాంటి ఫ‌న్ టూ వ‌ర్కింగ్ స్టైల్ తో 'లైగ‌ర్' టీమ్ ఏడాది పొడ‌వునా ఎంజాయ్ చేసింద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇంత‌కుముందే జ‌వానీ తేరీ ఆఫ‌త్ .. అంటూ సాగే వీడియో పాట‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రొమాంటిక్ పాట‌ను అద్భుత‌మైన బీచ్ లొకేష‌న్ లో ఎగ్జోటిక్ డెస్టినేష‌న్ అనిపించే చోట తెర‌కెక్కించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌- అన‌న్య ఈ పాట ఆద్యంతం హాట్ గా క‌నిపించారు.

వీడీతో అన‌న్య ఒక రేంజులో రొమాన్స్ ని పండించింది. సాంగ్ రిలీజైన క్ష‌ణాల్లోనే మిలియ‌న్ల వ్యూస్ తో వెబ్ లో దూసుకెళ్లింది. లైగ‌ర్ కి యూత్ లో మ‌రింత‌ బ‌జ్ పెంచ‌డంలో ఈ పాట ప్ల‌స్ అయ్యింది.

అయితే ఈ సాంగ్ షూటింగ్ స‌మ‌యంలో త‌న‌కు ఎదురైన కొన్ని స్వీట్ థింగ్స్ ని అన‌న్య ఇప్పుడు ఫోటోల రూపంలో షేర్ చేసింది.  ఆఫ‌ట్ సాంగ్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో హీరోయిన్ మూవ్ మెంట్ ట్రై చేస్తున్న క్ర‌మంలో త‌న‌పై కొన్ని ఫెద‌ర్స్ (ప‌క్షి ఈక‌లు) ఎటాక్ చేసాయ‌ట‌.

నా త‌ల‌నీలాల్లో అవ‌న్నీ చిక్కుకుపోయాయి. ఆ త‌ర్వాత నా త‌ల కురులు బ్లోవ‌ర్ లో కూడా చిక్కుకుపోయాయి.. అంటూ వీడీతో పాటు ఉన్న ఫోటోని కూడా షేర్ చేసింది. ఇక ఈ ఫోటోల్లో అన‌న్య సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. వైట్ టూపీస్ లుక్ లో క్యూట్ గాళ్ అగ్గి రాజేసిన ఫోటో ఇప్పుడు వైర‌ల్ గా మారుతోంది. #Liger25న విడుద‌ల కానుంది.

టాలీవుడ్ డెబ్యూకి క‌ర‌ణ్ సాయం లైగ‌ర్ చిత్రంతోనే తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యమ‌వుతోంది అన‌న్య‌. ఈ సినిమా త‌ర్వాత సౌత్ లో భారీ అవ‌కాశాల్ని అందుకోవ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. త‌న‌దైన అందం ఆక‌ర్ష‌ణ‌తో మైమ‌రిపిస్తున్న ఈ బ్యూటీ హిందీ న‌టుడు సాహో ఫేం చుంకీ పాండే కుమార్తె. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ చిత్రంతో క‌ర‌ణ్ త‌న‌ను తెర‌కు ప‌రిచ‌యం చేసారు. ఇప్పుడు టాలీవుడ్ డెబ్యూ చిత్రానికి ఆయ‌నే నిర్మాత‌. పూరి-ఛార్మిల‌తో క‌లిసి అన‌న్య‌ను ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ ని చేస్తున్నాడు క‌ర‌ణ్‌.
Tags:    

Similar News