డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లైగర్. ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడో వచ్చింది. అయితే.. అసలు షూటింగ్ పనులు ఇప్పుడు మొదలయ్యాయి. అయితే.. పూరీ ఎంత వేగంగా సినిమాలు తీస్తాడో అందరికీ తెలిసిందే. సర్వం సిద్ధం చేసుకున్న పూరీ.. ఇక లైగర్ ను జెట్ స్పీడ్ లో పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ పై కూడా ఒక క్లారిటీ వచ్చేసినట్టు సమాచారం.
అయితే.. లైగర్ సినిమా బడ్జెట్ విషయంలో పలు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ పూరీ సినిమా అంటే బడ్జెట్ లిమిట్ దాటిన దాఖలాలు తక్కువ. అయితే.. మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి అంచనాలను రీచ్ అవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తోంది యూనిట్. ఈ క్రమంలోనే లైగర్ బడ్జెట్ అనుకున్నదానికంటే కాస్త పెరిగినట్టు టాక్.
కాగా.. కరోనా గోల లేకుంటే.. ఈపాటికే లైగర్ బొమ్మ థియేటర్స్ లో పడి ఉండేది. ఇక ఇప్పుడు సెట్ చేసుకున్న ప్లాన్ ప్రకారం సినిమాను సమ్మర్ క్లోజింగ్ లోగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అంటే.. జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని తెలుస్తోంది. అప్పటికి పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి కాబట్టి.. పెద్దగా పోటీ కూడా ఉండదని భావిస్తున్నట్టు సమాచారం.
లైగర్ సినిమాని హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.110కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని టాక్. అయితే.. ఇది ఇప్పటి వరకూ ఉన్న అంచనా మాత్రమేనని తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉందట. దీంతో.. పూరీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చూడాలి మరి.. అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తాడో లేదో!