'లైగర్' ఫస్ట్ గ్లిమ్స్: ఇంటర్నేషన్ బాక్సర్ గా ఎదిగిన ముంబై స్లమ్ డాగ్..
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ''లైగర్''. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. అనౌన్స్ మెంట్ నుంచే భారీ హైప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
ఇప్పటికే విడుదలైన 'లైగర్' ఫస్ట్ లుక్ అనూహ్య స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో న్యూ ఇయర్ కానుకగా తాజాగా సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ దేవరకొండను స్లమ్ డాగ్ గా.. ముంబై వీధుల్లో చాయ్ వాలా నుంచి అంతర్జాతీయ బాక్సర్ గా ఎదిగినట్లు చూపించారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ముంబై నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చినప్పటికీ.. గ్లిమ్స్ లోనే ఆ విషయాన్ని వెల్లడించి సినిమాలో ఏం చూపించబోతున్నారో అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారు. ఇందులో విజయ్ తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ.. అతనిలోని టాలెంట్ ని గుర్తించిన బాక్సింగ్ కోచ్ గా బాలీవుడ్ నటుడు రోనీత్ రాయ్ కనిపించారు.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో 'లైగర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి విజయ్ దేవరకొండ పడిన శ్రమంతా 'లైగర్' గ్లిమ్స్ లో కనిపిస్తోంది. దీని కోసం శిక్షణ తీసుకున్న VD.. కండలు తిరిగిన దేహంతో డిఫరెంట్ మెకోవర్ & యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు.
'వీ ఆర్ ఇండియన్స్' అంటూ దేశభక్తిని పెంపొందించేలా తన వాయిస్ ని గట్టిగా వినిపించాడు. అలానే చివర్లో 'వాట్ లగా దేంగే' అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ కూడా ఇస్తున్నాడు రౌడీ బాయ్. మొత్తం మీద ఈ గ్లిమ్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఈ సినిమా పూరీ జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చెప్పకనే చెబుతోంది.
ఫస్ట్ గ్లిమ్స్ లో యాక్షన్ సీన్స్ - బ్యాగ్రౌండ్ స్కోర్ - విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థాయ్లాండ్ కు చెందిన కెచా ఈ సినిమాకు స్టంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మేకర్స్ వెల్లడించలేదు. ఈ చిత్రానికి జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో దిగ్గజ బాక్సర్ ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. ఆలీ - విషురెడ్డి - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్ తో ధర్మ ప్రొడక్షన్స్ - పూరి కనెక్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ - అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'లైగర్' చిత్రాన్ని 2022 ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.
Full View