ఎవరైనా? సినిమాని ప్రమోట్ చేయాలంటే ముందుగా కంటెంట్ చూపిస్తారు. లేదంటే విజువల్ గ్రాఫిక్స్ చూపిస్తుంటారు. అదీ కుదరకపోతే జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ యాటిట్యూడ్ ప్రమోషన్ ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు `లైగర్` ప్రమోషన్ చూస్తే అలాగే కనిపిస్తుంది. కంటెంట్ ది ఏముంది బాస్.. యాటిట్యూడ్ లోనే `వాట్ లగా దేంగే` అంటూ డ్యాషిండ్ డైరెక్టర్ పూరి అండ్ కో దూసుకుపోతుంది.
దాదాపు `లైగర్` ప్రమోషన్ అంతా ఇలాగే జరుగుతోంది. విజయ్ దేవరకొండ అంటేనే యాటిట్యూడ్ కా బాప్. `గీత గోవిందం` లాంటి క్లాస్ సినిమా చేసినా..`అర్జున్ రెడ్డి` లాంటి కల్ట్ క్లాసిక్ చేసినా.. `వరల్డ్ ఫేమస్ లవర్` లాంటి డిజాస్టర్ అందించినా విజయ్ లో ఎక్కువగా కనిపించేది యాటిట్యూడే. ఆ ఒక్క క్వాలిటీనే మిగిలిన యంగ్ హీరోల నుంచి అతన్ని వేరు చేస్తుందన్నది నమ్మాల్సిన నిజం.
ఈ జనరేషన్ లో చాలా మంది హీరోలకు లేని ఫాలోయింగ్ ని ఆ లక్షణమే విజయ్ కి తెచ్చిపెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు `లైగర్` ప్రచారానికి ఇదే యాటిట్యూడ్ కలిసొస్తుంది. పూరి తెలివిగా అతని యాటిట్యూడ్ ని ప్రచారం కోసం వాడుకుంటున్నాడు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలైన దగ్గర నుంచి లైగర్ ని పరిశీలిస్తే అంతా యాటిట్యూడ్ మీదనే వెళ్లిపోతున్నట్లు కనిపిస్తుంది.
`లైగర్` తొలి టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి తాజాగా `వాట్ లగా దేంగే` అంటూ రచ్చ చేసే వరకూ కంటెంట్ కంటే ఎక్కువగా విజయ్ యాటిట్యూడే తోనే ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ట్రైలర్స్..లిరికల్స్ లో విజయ్ దేవరకొండ కనిపిస్తున్న తీరు `లైగర్` పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. విజయ్ కి తెలంగాణ స్లాంగ్ చాలా వరకూ అతని కెరీన్ ని బిల్డ్ చేయడంలో ఉపయుక్తంగా మారిందని చ చెప్పుచ్చు. తనదైన శైలి వాక్చుతర్యంతో ఆకట్టుకోవడం అతనిలో తెలియని క్వాలిటి. అదే విజయ్ ని ఇంత దూరం తీసుకొచ్చింది.
తొలి సినిమా `పెళ్లి చూపులు` లోనే అతనిలో ఏదో మ్యాజిక్ ఉందని ఇండస్ర్టీ గుర్తించింది. దానికి తోడు యంగ్ హీరోలో ట్యాలెంట్ కలిసొచ్చింది. తనలో ఈ రకమైన యాటిట్యూడ్ తోనే బాలీవుడ్ కుర్రభామలకు కునుకు లేకుండా చేస్తున్నాడు. టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే ఈ రకమైన స్ర్టాటజీని ఎక్కువగా అప్లై చేస్తున్నాడు. మరి ఈ యాటిట్యూడ్ కి పూరి మార్క్ కంటెంట్ కూడా తోడైందంటే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. మరి ఆ అంచనాలు అందుకుంటుందా? లేదా? అన్నది తెలియాలంటే ఆగస్టు 25వరకూ వెయిట్ చేయక తప్పదు.