'లైగర్' సెటిల్మెంట్ వ్యవహారంలో జరిగింది ఇదే..?

Update: 2022-10-25 13:30 GMT
'లైగర్' సినిమా సెటిల్ మెంట్ కు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎగ్జిబిటర్స్ ను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఎంతో కొంత నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా కూడా సంయమనం పాటించకపోవవడంపై పూరీ ఈ ఆడియోలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఈ సినిమాతో భారీగా నష్టపోయిన బయ్యర్లను ఆదుకోడానికి దర్శక నిర్మాత పూరీ ముందుకు వచ్చారు. వారితో మాట్లాడి కొంత మేర సెటిల్ చేస్తానని.. దానికి నెల రోజుల టైం తీసుకున్నారని తెలుస్తోంది.

'లైగర్' సినిమాకు సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కుల చెల్లింపులతో బయ్యర్లకు సెటిల్ చేయాలని పూరీ భావించారట. డిజిటల్ డీల్స్ అప్పట్లోనే క్లోజ్ అయినప్పటికీ.. ఫైనల్ పేమెంట్స్ ఇంకా రావాల్సి ఉందట. అందుకే నష్టపరిహారం చెల్లించడానికి పూరీ కాస్త సమయం తీసుకున్నారు. అయితే గడువు పూర్తయ్యిందో ఏమో.. ఈలోగా ఎగ్జిబిటర్లు తమ స్థైర్యాన్ని కోల్పోయి నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో 'లైగర్' ఎగ్జిబిటర్స్ అంతా పూరీ జగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్ధమైనట్లు.. సహచర బయ్యర్లకు వాట్సాప్ మెసేజ్ ను పంపించినట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 83 మంది ఎగ్జిబిటర్స్ ఈ నెల 27న పూరి ఇంటికి ధర్నాకు వెళ్లాలనేది అందులోని సారాంశం. ఇది పూరీ దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా.. పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని ఇవ్వాలని అనుకున్నానని.. కానీ ఇస్తానని చెప్పినా తనను బ్లాక్‌ మెయిల్ చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదని పూరీ జగన్నాథ్ అన్నారు. ధర్నా చేసిన వాళ్లను మినహాయించి మిగతా వాళ్లకు డబ్బులు చెల్లిస్తానని పూరి ఫైర్ అయ్యారు.

నిజానికి ఇక్కడ పూరీ ఎగ్జిబిటర్లకు జవాబుదారీ కాదు. ఇదే విషయాన్ని ఆడియోలో దర్శకుడు స్పష్టం చేశారు. 'పోకిరి' దగ్గర నుంచి 'ఇస్మార్ట్ శంకర్' వరకు బయర్స్ నుంచి తనకు రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయని అన్నారు. ఇప్పుడు తన సినిమా కారణంగా బయ్యర్లు నష్టపోయారు కదా అని వారికి అండగా నిలవడానికి ముందుకు వచ్చారు. అయినప్పటికీ ధర్నా చేస్తామని బెదిరించడమే పూరీకి ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది.

సినిమా అనేది ఒక వ్యాపారం. హిట్లు ప్లాప్స్ అనేవి కూడా సర్వ సాధారణం. సక్సెస్ అయితే డబ్బులు వస్తుంటాయి.. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నష్టాలు తెచ్చిపెడుతుంటాయి. తన సినిమా వల్ల నష్టపోయిన వారిని ఆదుకోడానికి.. బయ్యర్లతో సత్సంబంధాలు ఉండాలని ఆలోచించిన నిర్మాతలు మాత్రం తమ బాధ్యతగా ఎంతో కొంత నష్ట పరిహారం చెల్లిస్తుంటారు.

ఇప్పుడు 'లైగర్' విషయంలోనూ పూరీ కొంత మేర నష్టం పూడ్చడానికి ముందుకు వచ్చారు. కాకపోతే అది సకాలంలో అందడం లేదని ఇప్పుడు బయ్యర్లు రోడ్డెక్కాలని నిర్ణయించారట. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వాలనిపించదని పూరీ అంటున్నారు. ఏదేమైనా ఈ వ్యవహారం పెద్దది కాకముందే.. సామరస్యంగా తేల్చుకుంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News