టాలీవుడ్ లో కెరీర్ పరంగా ఎదురే లేని లైనప్ తో దూసుకెళుతున్నాడు విజయ్ దేవరకొండ. యువహీరోల్లో నిస్సందేహంగా అసాధారణ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరో అతడు. విజయ్ మాట్లాడే తీరు.. దూసుకెళ్లే తత్వం.. ఫ్యాషనిస్టాగా వైవిధ్యం .. అతడి కథల ఎంపికలు ప్రతిదీ తనపై ప్రజల్లో ఆకర్షణను పెంచాయి.
వ్యక్తిగతంగా వైబ్రేన్సీ నమ్మకమైన అభిమానులను సంపాదించి పెట్టింది. అయితే హీరోగా ఎదిగినా అతడు ఒదిగి ఉండే తత్వంతో ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాడు. లైగర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అవుతున్నా అతడు కించిత్ గర్వాన్ని కూడా చూపించడు. ఇక విజయ్ నటుడిగా మారడానికి ముందు దశ ప్రేక్షకుల పట్ల భిన్నమైన విధానాన్ని కలిగి ఉండటానికి ఒక కారణమని దేవరకొండ చెప్పారు. అతను చాలా మందిలాగే నటుడిగా మారడానికి ముందు ఒక సామాన్యుడిలా జీవితాన్ని గడిపాడు. మొదటి రోజు మొదటి షో చూడటానికి కాలేజ్ బంక్ కొట్టానని అతడు చెప్పాడు. అతను తన స్నేహితులతో కలిసి సినిమా టిక్కెట్ల కోసం తెల్లవారుజామున క్యూలో వేచి ఉన్నాడు. నటుడిగా మారడానికి ముందు తాను అలా జీవించినప్పుడు ప్రేక్షకుల పట్ల తన అవగాహన భిన్నంగా ఉంటుందని దేవరకొండ భావిస్తున్నాడు. అతను ప్రేక్షకుల అనే భావనను పక్కనపెట్టి ప్రేక్షకులను తన సినిమాలు చూడటానికి వచ్చిన స్నేహితులుగా చూస్తాడట.
నెవ్వర్ బిఫోర్ అనేలా దూసుకెళుతున్నాడు!
లైగర్ చిత్రంతో క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోనున్నాయి. ఈ సినిమాని హిందీలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు కరణ్ జోహార్ సన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది. ఎంతగా అంటే రజనీకాంత్ సినిమాని మించి ప్రభాస్ తర్వాత విజయ్ అనేంతగా అతడిని ప్రమోట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. విజయ్ ని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వరుణ్ ధావన్ ని పరిచయం చేసినంత వైబ్రేంట్ గా పరిచయం చేయాలని కరణ్ భావిస్తున్నారట.
ముంబైలో విజయ్ దేవరకొండ -కరణ్ జోహార్ తో కలిసి పార్టీ చేసుకునేంత చనువు ఉందిప్పుడు. ఇంతకుముందు లైగర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వెంట వెంటనే విజయ్ తో మరో యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని కథనాలు కూడా వైరల్ అవుతున్నాయి. విజయ్ తెలుగు చిత్రసీమలో ఎదురేలేని హీరో. ఇప్పుడు హిందీ సినిమా అతని కోసం తలుపులు తెరిచినందున గంగా నుండి గంగోత్రి వరకు మొత్తం బెల్ట్ లో భారీగా అభిమానం సంపాదిస్తాడని ప్రజల మనసులు గెలుస్తాడని భావిస్తున్నారని ధర్మ కాంపౌండ్ లీకులు ఇస్తోంది.
లైగర్ పై విజయ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇది తనకు పూర్తి స్థాయి బిగ్ స్క్రీన్ అనుభవం అవుతుందని.. భారీ యాక్షన్ సీక్వెన్స్ ల కోసం చాలా కష్టపడ్డామని చెబుతున్నారు. ఇంతకు ముందు ప్రేక్షకులు చూడని కొత్త యాక్షన్ సినిమాని చూపిస్తామని విజయ్ నమ్మకంగా ఉన్నారు. లైగర్ ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు తీసుకువస్తారనే నమ్మకం నాకుందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.