యువ హీరో సంతోశ్ శోభన్ నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. న్యాచురల్ స్టార్ నాని, డైరక్టర్ మారుతి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. సినిమా హీరో సంతోశ్ శోభన్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతని స్పీచ్ కూడా హైలెట్ గా నిలిచింది. ఏక్ మిని కథ లాంటి హిట్ ఇచ్చి తన కెరియర్ నిలబెట్టిన మేర్లపాక గాంధితో మళ్లీ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా చేయడం తన లక్ అని అన్నారు సంతోశ్ శోభన్. హీరోగా డిఫరెంట్ జోనర్ లలో సినిమాలు చేస్తాం కానీ వాళ్ల సినిమానే ఒక ప్రత్యేకమైన జోనర్ చాల తక్కువమందికి అవుతుంది. అది మేర్లపాక గాంధి వల్ల అయ్యిందని అతను డైరక్టర్ మాత్రమే కాదు అతను ఒక కొత్త జోనర్ ని క్రియేట్ చేశాడని అన్నారు సంతోశ్ శోభన్. ఆయనతో మళ్లీ మళ్లీ చేయాలని ఉందని అన్నారు.
హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా ఫెంటాస్టిక్ యాక్టర్.. కమర్షియల్ సినిమాల్లో ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది.. అలా చేస్తే బాగుంటుందని అనుకుంటాం కానీ ఫన్ అండ్ కమర్షియల్ సినిమాలో కూడా హానెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తే చాలు అదంతే ఎఫెక్టివ్ గా ఉంటుందని ఫరియా దగ్గర నేర్చుకున్నానని అన్నారు సంతోశ్ శోభన్. ఆమెతో కూడా కలిసి మళ్లీ సినిమాలు చేయాలని.. చేస్తానని అన్నారు. ప్రవీణ్ లక్కరాజు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఏక్ మిని కథకు ఆయనే మ్యూజిక్ ఇచ్చారని ఆ సక్సెస్ మళ్లీ రిపీట్ అవుతుందని అన్నారు.
బ్రహ్మాజి గురించి మాట్లాడుతూ.. బ్రహ్మాజి గారు ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టర్.. ఆయన తెలుగు సినిమాలో ఉన్నందుకు మనం గర్వపడాలని అన్నారు. తన సినిమాల్లో సుదర్శన్ ఖచ్చితంగా ఉంటాడని.. అతను లేకుండా సినిమాలు చేయనని అన్నారు సంతోశ్ శోభన్. టీం అంతా ఎంతో ఇష్టంతో ఈ మూవీ చేశామని ఖచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అన్నారు. ఇక ఫైనల్ గా నాని గురించి మాట్లాడుతూ తన కెరియర్ లో తన ఫస్ట్ సినిమా చూసింది.. తనకు ఫస్ట్ కామెంట్ ఇచ్చింది నాని గారే. తనతో ఉన్న వారు తను నానిలా చేస్తానని అంటుంటారు. ఈ జెనరేషన్ కి నాని గారే మా ఇన్ స్ప్రేషన్ అని అన్నారు సంతోశ్ శోభన్.