టీజర్: రొమాన్స్ - క్రైమ్ - కామెడీ కలబోసిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్'

Update: 2022-09-19 12:30 GMT
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ''లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్''. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ కామెడీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించారు. ఇందులో 'జాతిరత్నాలు' ఫేమ్ ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.

ఇంతకముందు సంతోష్ నటించిన 'ఏక్ మినీ కథ' చిత్రానికి కథ - స్క్రీన్‌ ప్లే అందించిన మేర్లపాక గాంధీ.. ఇప్పుడు ''లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'' సినిమాలో క్రైమ్ ఎలిమెంట్స్ ని కూడా జోడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగించింది.

మేర్లపాక గాంధీతో కలిసి 'మ్యాస్ట్రో' సినిమాకు వర్క్ చేసిన యూత్ స్టార్ నితిన్ తాజాగా ''లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'' టీజర్ ను లాంచ్ చేశారు. క్రైమ్ మరియు కామెడీ కలయికలో వచ్చిన ఈ టీజర్ ఆశాజనకంగా ఆకట్టుకునేలా ఉంది.

యూట్యూబ్ చానెల్ కోసం వీడియోలు చేసి మంచి ట్రావెల్ బ్లాగర్‌ అనిపించుకోవాలకున్న సంతోష్ శోభన్.. తన స్నేహితుడు నెల్లూరు సుదర్శన్‌ తో కలిసి ఒక అందమైన ప్రదేశాన్ని సందర్శించాడు. ఈ ప్రయాణంలో అతను ఒక అందమైన అమ్మాయి ఫరియా అబ్దుల్లాను కలుస్తాడు.

ఫరియా ని ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తున్న సంతోష్.. అనుకోకుండా ఓ ప్రమాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. టీజర్ ని బట్టి మేర్లపాక గాంధీ రొమాన్స్ - క్రైమ్ మరియు కామెడీ అంశాలను కలబోసిన విలక్షణమైన సబ్జెక్ట్‌ ని ఎంచుకున్నారని అర్థమవుతుంది.

ఇందులో సంతోష్ శోభన్ తనదైన కామిక్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఫరియా అబ్దుల్లా అందంగా కనిపించింది. నెల్లూరు సుదర్శన్‌ కెమెరామెన్ గా.. సంతోష్‌ తో పాటు ప్రయాణించే కీలక పాత్రలో కనిపించాడు. వీరిద్దరి మధ్య సీన్స్ ఫన్నీగా ఉన్నాయి. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన టీజర్ ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

'శ్యామ్ సింగరాయ్‌' సినిమాతో నిర్మాణంలోకి దిగిన వెంకట్ బోయనపల్లి.. తన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో ఆముక్త క్రియేషన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా.. వసంత్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు.

''లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'' చిత్రాన్ని నవంబర్‌ లో థియేటర్లలోకి తీసుకురానున్నట్లు టీజర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. వెరైటీ టైటిల్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా సంతోష్ మరియు మేర్లపాక గాంధీకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News