ఈ ఏడాది ఇప్పటిదాకా వచ్చిన పెద్ద సినిమాల లిస్టు తీస్తే అందులో ఏదీ కూడా అనుకున్న డేట్‌కి రిలీజ్ కాలేదు. రేపో ఎల్లుండో రిలీజ్ అనుకున్నపుడు కూడా డేట్లు మారిన సందర్భాలున్నాయి. గోపాల గోపాల, టెంపర్, సన్నాఫ్ సత్యమూర్తి.. ఈ మూడు సినిమాలు కూడా రిలీజ్ డేట్ మార్చుకున్నవే. టాలీవుడ్లో తర్వాత రాబోయే స్టార్ సినిమా 'లయన్' రిలీజ్ డేట్ విషయంలోనూ చాన్నాళ్ల నుంచి సందిగ్ధత ఉంది. మార్చి నెలాఖరులోనే వస్తుందనుకున్న ఈ సినిమా.. మే 1కి వాయిదా పడింది. ఈ మధ్యే విడుదల తేదీని ఒక రోజు ముందుకు తెస్తూ ఏప్రిల్ 30నే సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐతే ఇది అఫీషియల్ డేట్ కాదు. నిర్మాత నుంచి అధికారిక సమాచారం ఇంకా రాలేదు. ఐతే ప్రస్తుతానికి ఈ డేటు విషయంలో నమ్మకంగా ఉన్నారు నందమూరి అభిమానులు. మామూలుగా అయితే ఆడియో ఫంక్షన్ రోజు నిర్మాత రిలీజ్ డేట్ ప్రకటించడం ఆనవాయితీ. కానీ రుద్రపాటి రమణరావు విడుదల తేదీ ప్రస్తావనే తేలేదు. త్వరలోనే మీ ముందుకు వస్తుంది అని ఊరుకున్నాడు. దీంతో లయన్ అనుకున్నట్లే ఏప్రిల్ 30న విడుదలవుతుందా.. లేక తేదీ మార్చుకుంటుందా అనేది సందేహంగా మారింది. చూద్దాం ఏమవుతుందో?