హీరోగా మోహన్ బాబు యాక్షన్ ను .. ఎమోషన్ ను ఏ స్థాయిలో వర్కౌట్ చేశారో, కామెడీని .. రొమాన్స్ ను కూడా అదే స్థాయిలో వర్కౌట్ చేశారు. ఆయన సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ .. ఆ సీన్స్ కి మరింత గాఢత పెంచే డైలాగ్స్ ఉండేవి. ఇక ఆయన సినిమాల్లో కొన్ని పాటలు కూడా రొమాన్స్ విషయంలో తామేమీ తక్కువ తినలేదనే విషయంలో గుర్తుకు చేస్తాయి.
రొమాంటిక్ హీరో అనే క్రేజ్ ను మోహన్ బాబు కోరుకోలేదుగానీ, ఆయన సినిమాల్లో రొమాన్స్ పాళ్లు మాత్రం పుష్కలంగా ఉండేవి. ఇక ఈ మధ్య ఆయన సినిమాల సంఖ్యను తగ్గించుకోవడం .. ఆ తరహా పాత్రలు చేయకపోవడం తెలిసిందే.
అయితే మోహన్ బాబు తాజా చిత్రమైన 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాలో మాత్రం ముద్దు సీన్లు బాగానే ఉన్నాయట. ఈ విషయాన్ని ఎవరో చెబితే గాసిప్ అనుకోవచ్చును గానీ, ఆయనే స్వయంగా చెప్పినప్పుడు ఇక డౌటెందుకు ఉంటుంది.
"మా సినిమాలోను ముద్దులు ఉన్నాయి .. అవి కూడా మామూలు ముద్దులు కాదు, ఆడ .. ఆడ పెట్టుకునే ముద్దులు" అంటూ ఆయన తనదైన స్టైల్లో చెప్పారు. రీసెంట్ గా 'డీజే టిల్లు' సినిమా థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా పోస్టర్లు చూడగానే ఇదొక ముద్దుల యుద్ధం అనే విషయాన్ని కుర్రకారు వెంటనే పసిగట్టేశారు. అందుకు నిదర్శనమే ఈ సినిమా వసూళ్లు.
కుర్రాళ్లను థియేటర్లకు రప్పించడానికి ముద్దుకు మించిన మంత్రం లేదు .. ముద్దుకు మించిన మాత్రలు లేవు అనే విషయాన్ని గతంలో కొన్ని సినిమాలు నిరూపించాయి. ఆ జాబితాలోకి 'డీజే టిల్లు' కూడా చేరిపోయింది.
ఈ సినిమా సక్సెస్ లో ముద్దులు ముఖ్యమైన పాత్రను పోషించాయనే టాక్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో తమ సినిమాలోను ముద్దులున్నాయని మోహన్ బాబు చెప్పడం గమనించదగిన విషయం. అయితే థియేటర్లలో మాత్రం ఈ ముద్దు సీన్స్ చూసే అవకాశం లేదట. 'మరి ఎక్కడ చూపిస్తారో చెప్పండి .. అక్కడికే వెళతాం' అంటూ కంగారు పడిపోవద్దు.
ముందుగా ఈ సినిమాను ఓటీటీ కోసం అనుకుని తీశారట. ఆ తరువాత కంటెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది గనుక, థియేటర్స్ కి వెళ్లడమే మంచిదనే ఆలోచనతో ఇటు వైపుకు వచ్చారట. ఓటీటీలో రిలీజ్ అయ్యుంటే మాత్రం ఆ ముద్దులన్నీ ముద్దు ముద్దుగా పలకరించేవట.
థియేటర్ కోసం అనుకున్న తరువాత మాత్రం ఆ సీన్స్ వద్దనుకున్నారని తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా అలరించిన ఈ సినిమాలో శ్రీకాంత్ .. సునీల్ .. పోసాని .. అలీ .. వెన్నెల కిశోర్ .. ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా నిడివి గంటా ఇరవై నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన థియేటర్స్ కి వస్తున్న ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు.