వైజాగ్ కి గిర్రా గిర్రా తిరిగిందంతే. రాక్ స్టార్ దేవీశ్రీ దెబ్బకు వైజాగ్ బీచ్ ఒణికింది. సంగీత సునామీ వచ్చి తాకిందా అన్నంతంగా జనం ఉర్రూతలూగారు. స్వతహాగానే స్టేజీ ఎక్కితే చెలరేగిపోయే దేవీశ్రీ ఈసారి విశాఖ ఉత్సవ్ లో తనకు వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. అతడు మరోసారి తనదైన శైలిలో మాంచి ఊపున్న మ్యూజిక్ నే ఇచ్చాడు ఎఫ్ 2 చిత్రానికి.
ఆ సినిమాలో రెండు ఛమక్కు లాంటి పాటలు ఉన్నాయి. గిర్ర గిర్ర అంటే బుర్ర తిరగాలి..అంటూ మానస్వి పాడిన పాట మాంచి మాస్ మసాలా ఛమక్కులతో మైమరిపించింది. దేవీ ఈ పాటను వేదికపైనా గాయనీగాయకులతో పాడించాడు. బీచ్ లో జనం ఈ మాస్ పెప్పీ నంబర్ కి ఉర్రూతలూగారు. ఉర్ర ఉర్ర ఉర్ర ఊదేద్దాం బూర...అంటూ ఈ పాటలో పదాలతోనే దేవీ బోలెడంత మ్యాజిక్ చేశాడు. ఇక ఎఫ్ 2 చిత్రంలో మరో ఊపున్న పాట ఉంది.
దేవీశ్రీ రాకింగ్ మ్యూజిక్ కి ఎఫ్ 2 ఆడియోలో దిల్ రాజు - వెంకీ - వరుణ్ తేజ్ బృందం హుషారుగా స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఇకపోతే సంక్రాంతి బరిలో వస్తున్న సినిమాల్లో చరణ్ సినిమా - రజనీ సినిమా కూడా బాగా ఆడాలని విక్టరీ వెంకటేష్ కోరారు. ఎఫ్ -2 ఆడియెన్ కి మాంచి ఊపు నిస్తుందని అన్నారు. ఇక వైజాగ్ ఉత్సవ్ వేడుకలో జనం భారీగా ఈ వేదికకు విచ్చేశారు.
Full View