పూరి-వరుణ్.. పెద్ద దెబ్బే కొట్టారు

Update: 2015-12-26 09:30 GMT
‘లోఫర్’ సినిమాను నిలబెట్టడానికి పూరి జగన్నాథ్ శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. కాలికి బలపం కట్టుకుని టీవీ ఛానెళ్ల చుట్టూ తిరిగేస్తూ గొప్ప సెంటిమెంటు చిత్రం.. తప్పక చూడండి అంటూ ప్రమోట్ చేస్తున్నాడు కానీ.. కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఫస్ట్ వీకెండ్ అవ్వగానే ‘లోఫర్’ కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఇక వీకెండ్ వచ్చేసరికి ఒకటికి నాలుగు సినిమాలు థియేటర్లలోకి దిగడంతో ‘లోఫర్’ పనైపోయింది. స్క్రీన్లు తగ్గించేశారు. ఉన్న వాటిలో కూడా కలెక్షన్లు లేవు. తొలి వారం పూర్తయ్యేసరికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా షేర్ రూ.10.14 కోట్లు మాత్రమే వచ్చింది. గ్రాస్ వసూళ్లు రూ.16.5 కోట్లు.

ఐతే ‘లోఫర్’ సినిమాకు జరిగిన వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.19 కోట్లు. అంటే ఇంకా దగ్గర దగ్గర 9 కోట్ల లోటన్నమాట. రెండో వీకెండ్ కూడా అయ్యేసరికి ‘లోఫర్’ మహా అయితే ఇంకో రెండు కోట్లు వసూలు చేస్తే ఎక్కువేమో. అంటే అప్పటికి ఇంకో రూ.7 కోట్లు మైనస్సే అన్నమాట. డొమెస్టిక్ వసూళ్లతో పోలిస్తే యుఎస్ లోనే పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ సినిమాకు అటు ఇటుగా రూ.20 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారు. ఈ మొత్తం అక్కడ ఖర్చులకే సరిపోతుంది. కాబట్టి పెట్టుబడి అంతా దాదాపుగా బూడిదలో పోసిన పన్నీరే అన్నమాట. పూరి-వరుణ్ కాంబినేషన్ చూసి పెట్టుబడి పెట్టిన బయ్యర్లకు పెద్ద దెబ్బే తగిలినట్లుంది.
Tags:    

Similar News