మొత్తానికి మ‌రో ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు?

Update: 2015-12-22 05:12 GMT
పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లోఫ‌ర్ తెర‌కెక్కి ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ రొటీన్ స్ట‌ఫ్‌ తో తెర‌కెక్కిన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌ టైన‌ర్ అన్న టాక్ తెచ్చుకుంది. ఫ‌లితం ఓవ‌ర్సీస్‌ లో బాక్సాఫీస్ కుదేలైపోయింది. అంచ‌నాల‌ను క‌నీస మాత్రంగానైనా అందుకోలేక‌పోయింది. దీంతో వ‌రుణ్ తేజ్‌ న‌టిస్తున్న సినిమాల‌న్నీ బాగానే ఉంటున్నాయ్ కానీ.. బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌లితాలే బాలేద‌న్న విమ‌ర్శ‌లొస్తున్నాయ్‌.

వ‌రుణ్ బాగా న‌టిస్తున్నాడు. కానీ బాక్సీఫీస్ వ‌ద్ద ఊపేసేంత వ‌సూళ్లు తేలేక‌పోతున్నాడ‌న్న నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. ముకుంద‌ - కంచె సినిమాల‌తో వ‌రుణ్‌ తేజ్ న‌టుడిగా స‌క్సెసైనా బాక్సాఫీస్ వ‌ద్ద బ్రేక్ ఈవెన్ సాధించ‌డంలో కొంత త‌డ‌బ‌డ్డాడ‌ని ట్రేడ్‌ లో టాక్ న‌డిచింది. ఇప్పుడు మ‌రోసారి అదే ఫ‌లితాన్ని రిపీట్ చేశాడు వ‌రుణ్‌. ఈసారి ఎంతో ప్రామిస్సింగ్ అని చెప్పుకున్న లోఫ‌ర్ బాక్సాఫీస్ ఫ‌లితం తొలి వీకెండ్‌ లోనే తేలిపోయింది. నాలుగు రోజుల్లో  తెలుగు రాష్ర్టాల్లో 7.55 కోట్లు వ‌సూలు చేసిన లోఫ‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్నిచోట్లా క‌లుపుకుని 8.45 కోట్లు వ‌సూలు చేసింది. అమెరికాలో 32 లొకేష‌న్ల‌లో రిలీజై కేవ‌లం 32 వేల డాల‌ర్లు మాత్ర‌మే ఆర్జించి డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకుంది. రెండో రోజు నుంచే అక్క‌డ వ‌సూళ్ల ప‌రంగా చ‌తికిల‌బ‌డింది.

లాంగ్‌ రన్‌ లో కంచె సినిమా 15 కోట్లు షుమారు వసూలు చేసింది.. అయినా కూడా పంపిణీదారులకు కాస్త లాసులు తప్పలేదట. త‌న సినిమాల బాక్సాఫీస్ ఫ‌లితం మాటేమో కానీ తాను మాత్రం ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. బ‌య్య‌ర్లు - డిస్ర్టిబ్యూట‌ర్ల‌ను ఆదుకునేందుకు మెగా కాంపౌండ్ స‌రైన చ‌ర్య‌లు చేప‌డితో వ‌రుణ్ భ‌విష్య‌త్ తో మాంచి డిపెండబుల్‌ స్టార్‌ గా ఎదిగే ఛాన్సుంద‌ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అది సంగతి.

Tags:    

Similar News