దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. లోకేష్ కనగరాజ్ అత్యంత ప్రతిష్టాతక్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ చాలా ఏళ్ల విరామం తరువాత కమల్ హాసన్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించడమే కాకుండా ఆయన ఊహించని స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కాసుల వర్షాన్ని కురిపించిన ఆశ్చర్యపరిచింది. గతంలో కమల్ చేసిన అప్పులన్నింటీని తీర్చి ఆయనతో సరికొత్త ఉత్సాహాన్ని ఈ మూవీ అందించడం విశేషం.
పాన్ ఇండియా మూవీగా దేశ వ్యాప్తంగా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టించింది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాంగా తెరకెక్కిన ఈ మూవీలో హీరో సూర్య రోలెన్స్ గా చివరి పది నిమిషాల్లో కనిపించి 'విక్రమ్' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి ప్రధాన కారణంగా నిలిచాడు. సూర్య పాత్రని తీర్చి దిద్దిన తీరు, అతని మేకోవర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. రోలెన్స్ అంటూ డ్రగ్ మాఫియా కింగ్ పిన్ గా సూర్య నటించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్య పరిచింది.
సూర్య ఫ్యాన్స్ ని 'రోలెక్స్ క్యారెక్టర్ షాక్ కు గురిచేసింది. ఇంతగా చర్చనీయాంశంగా మారిన ఈ పాత్ర ప్రధానంగా దర్శకుడు లోకేష్ కనగారాజ్ ఓ భారీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దళపతి విజయ్ హీరోగా భారీ గ్యాంగ్ స్టర్ డ్రామాకు శ్రీకారం చుట్టబోతున్నారు. విజయ్ 67గా తెరపైకి రానున్న ఈ మూవీని కూడా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో కమల్ 'విక్రమ్', కార్తి 'ఖైదీ'లకు అనుసంథానంగా తెరపైకి తీసుకురాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన లోకేష్ కనగరాజ్ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. కమల్ హాసన్ తో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కనగరాజ్ తన తదుపరి ప్రాజెక్ట్ ల గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. రాబోయే పదేళ్లకు సరిపడా తన వద్ద సినిమాలున్నాయన్నాడు. ప్రస్తుతం దళపతి విజయ్ తో సినిమా చేస్తున్నా.. ఆ తరువాత కమల్ సర్ తో కూర్చుని మాట్లాడతా ఆ తరువాతే కార్తీతో 'ఖైదీ 2' మొదలు పెడతా అన్నాడు.
అది పూర్తయిన వెంటనే 'విక్రమ్' సీక్వెల్ వుంటుందని, అంతే కాకుండా 'రోలెక్స్' నేపథ్యంలోనూ ఓ మూవీ వుంటుందని చెప్పి షాకిచ్చాడు. పరిస్థితులని బట్టి సినిమాలు అటు ఇటు కావచ్చు.. ఇది మల్టీయూనివర్స్. దీంతో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేను.అది ప్రీక్వెల్ కావస్తు సీక్వెల్ కావచ్చు. వచ్చే పదేళ్ల వరకు నేను సెటిల్ అవుతాను అంటూ నవ్వేశాడు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.