లవ్ టూడే డైరెక్టర్.. స్టార్ హీరోతో గోల్డెన్ ఛాన్స్!

Update: 2022-12-12 03:51 GMT
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొత్త దర్శకులకి పెద్ద సినిమా ఆఫర్లు రావడానికి ఎంతో సమయం పట్టదు. కాకపోతే వారి మొదటి సినిమా మినిమం సక్సెస్ అందుకుంటేనే బంపర్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అగ్ర హీరోలు అయితే కథ ఏమాత్రం వచ్చినా కూడా వారికి నమ్మి అవకాశాలను ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అగ్ర దర్శకులుగా ఉన్న లోకేష్ కనగరాజు, అట్లీ, అలాగే హెచ్ వినోద్, పా.రంజిత్ ఇలా అందరి దర్శకులు కూడా మొదటి సినిమాతో మినిమం సక్సెస్ అందుకొని ఆ తర్వాత అగ్ర హీరోలతో సినిమాలు చేసిన వారే.

అయితే ఇప్పుడు లవ్ టూడే దర్శకుడు పేరు కూడా తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అతనికి ఒక స్టార్ హీరో దొరికే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అది కూడా తమిళ ఇండస్ట్రీలోని ఒక ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ AGS ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఈ ప్రొడక్షన్ నుంచి రీసెంట్ గా లవ్ టుడే డైరెక్టర్ ప్రదీప్ రంగన్నదన్ కు అడ్వాన్స్ వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ దర్శకుడు మొదట నయనతారతో కోమలి అనే సినిమా తీశాడు అది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ కావడంతో రెండవ సినిమా లవ్ టుడే తో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు. అందులో అతనే హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇక తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఇప్పుడు ప్రదీప్ దళపతి విజయ్ తో కూడా సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అతను ఇటీవల నిర్మాతలతో ఒక స్టోరీ లైన్ గురించి చర్చించాడట. అయితే హీరో విజయ్ కూడా అతని టాలెంట్ తెలుసుకొని కథను పూర్తిస్థాయిలో డెవలప్ చేయమని కూడా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మనోడు మంచి టాలెంటెడ్ డైరెక్టర్ కాబట్టి తప్పకుండా విజయ్ కు నచ్చే విధంగా కమర్షియల్ పాయింట్స్ తో డిఫరెంట్ కదను డెవలప్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక కథ పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News