మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం పై రోజురోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాను టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తుండగా మాట్నీ ఎంటర్టైన్మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆచార్య అనే పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ నెలలో నెక్స్ట్ షెడ్యూల్ మొదలు అవుతుందని అంటున్నారు. సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. కరోనా కారణంగా ఆచార్య షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మాతలు రూపొందిస్తున్నారు. అయితే మహమ్మారి కారణంగా సినిమా పరిశ్రమ మొత్తం ఆర్ధికంగా నష్టాలలో మునిగింది.
అందుకే మళ్లీ టాలీవుడ్ పరిశ్రమ ఆర్థికంగా మాములు స్థితికి చేరి కోలుకునేవరకు బడ్జెట్ లలో మార్పులు చేయనున్నారట. ఇప్పటికైతే ఆచార్యను భారీ బడ్జెట్ సినిమా చేయకుంటే మంచిదని చిరంజీవి ప్రొడ్యూసర్లకు అందరికి సలహా ఇచ్చాడట. అయితే నిర్మాతలు కూడా విషయం గ్రహించి బడ్జెట్ లో మార్పులు చేస్తారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో చిరుకి జంటగా కాజల్ నటిస్తుంది. అంతేగాక నిర్మాత రాంచరణ్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నారట. ఆయన పాత్ర చెమటలు పట్టించే విధంగా సీరియస్ గా ఉండబోతుందని తెలుస్తుంది. చిరంజీవి కోసం బాగా ఎమోషన్స్ తో కూడిన బలమైన డైలాగ్స్ రాశారట కొరటాల. మొత్తానికి ఈ సినిమాలో చిరంజీవి అంచనాలకు అందడని అంటున్నారు కొరటాల. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. ఓ చిన్న పాత్రలో నిహారిక కనిపించనుంది. చూడాలి మరి మెగాస్టార్ బడ్జెట్ తగ్గి త్వరగా సిద్ధం అవుతుందేమో!