'లస్ట్ స్టోరీస్' బోల్డ్ బ్యూటీ న్యూ స్టైలిష్ పిక్!

Update: 2021-02-10 02:30 GMT
బాలీవుడ్ భామ భూమి పడ్నేకర్ గురించి సౌత్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. బాలీవుడ్ నుండి సౌత్ ఇండస్ట్రీలకు ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్స్ వస్తుంటారు. అలా రావాలనుకునే వారిలో భూమి కూడా ఉంది. సరైన అవకాశం రాగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెడతానంటుందట. మీకోవర్ అనే పదానికి మరో పేరులా మారింది భూమి. దమ్ ల‌గాకే ఐసా అనే సినిమాతో సినీ ఇండ‌స్ట్రీలోకి ప్రవేశించింది భూమి.

 ఆ సినిమా టైంలో భూమి బ‌రువు వందకిలోల పైనే. ఆ క్యారెక్టర్ కు త‌గ్గ‌ట్లుగా ఆంటీలా కనిపించింది. కానీ ఆ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. చేసిన ఫస్ట్ సినిమాతోనే భూమి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న ప్రతిభావంతులైన హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతుంది అమ్మడు. ఫస్ట్ సినిమా తర్వాత అక్ష‌య్ కుమార్ సరసన టాయిలెట్ సినిమాలో న‌టించింది. ఆ సినిమా కూడా సూప‌ర్ హిట్ కావ‌డంతో భూమి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

అలాగే మధ్యలో లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్ లలో హాట్ షో చేసింది భూమి. ప్రస్తుతం బరువును తగ్గించి గ్లామర్ పెంచేసుకుంది అమ్మడు. అయితే నాజూకుగా మారినప్పటి నుండి భూమి పలు మ్యాగజైన్ ఫోటోషూట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా, మోడల్ గా పోజులు పెట్టింది. మరి గ్లామర్ ప్రియులు ఊరుకుంటారా.. అసలే బాలీవుడ్ అంటే గ్లామర్ షోకు ఏమాత్రం హద్దులు పెట్టుకోకూడదు. మంచి క్రేజ్ వచ్చాక భూమి కూడా గ్లామర్ డాల్ పాత్రలే చేస్తోంది.

ఇటీవలే దుర్గామతి అనే థ్రిల్లర్ మూవీ చేసింది. తెలుగు భాగమతి సినిమాకు రీమేక్ అది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో భూమికి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా అమ్మడు పీకాక్ అనే మ్యాగజైన్ ఫోటోషూట్ లో పాల్గొంది. ఎక్సట్రార్డనరీ అనే కాప్షన్ కలిగిన ఆ స్టైలిష్ పిక్ లో భూమి స్టైలిష్ దుస్తులలో మరింత అందంగా కనిపిస్తుంది. అలాగే ఐయామ్ నాట్ ఫర్ ఆర్డినరీ అనే నోట్ యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ దివా పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
Tags:    

Similar News